త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajya Sabha | రాజ్య‌స‌భకు నామినేష‌న్ దాఖ‌లు చేసిన వేం న‌రేంద‌ర్ రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీ

Rajya Sabha | కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున తెలంగాణ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా వేం న‌రేంద‌ర్ రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీ గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల అధికారి ఉపేంద‌ర్ రెడ్డికి నామినేష‌న్ ప‌త్రాల‌ను వారు అంద‌జేశారు.

S

Telangana | Published On Mar 5, 2026, 2.40 pm IST

Rajya Sabha | రాజ్య‌స‌భకు నామినేష‌న్ దాఖ‌లు చేసిన వేం న‌రేంద‌ర్ రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీ
Advertisement

Rajya Sabha | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున తెలంగాణ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా వేం న‌రేంద‌ర్ రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీ గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల అధికారి ఉపేంద‌ర్ రెడ్డికి నామినేష‌న్ ప‌త్రాల‌ను వారు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియ‌ర్ నేత‌లు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా అభిషేక్ మ‌ను సింఘ్వీ మాట్లాడుతూ.. తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వేం నరేందర్‌రెడ్డి చెప్పారు.

Advertisement
Advertisement