త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నితీష్ గ‌తే చంద్ర‌బాబుకు.. సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | భ‌విష్య‌త్‌లో బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ గ‌తే ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప‌డుతుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

S

National | Published On Apr 18, 2026, 3.52 pm IST

CM Revanth Reddy | నితీష్ గ‌తే చంద్ర‌బాబుకు.. సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : భ‌విష్య‌త్‌లో బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ గ‌తే ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప‌డుతుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల‌కు మ‌నుగ‌డ ఉండ‌దు. ప్ర‌స్తుతం నితీష్‌, ఏక్‌నాథ్ షిండే ప‌రిస్థితి చూస్తున్నాం. చంద్ర‌బాబు ప‌రిస్థితి కూడా అలాగే త‌యార‌వుతుంది. కేంద్రంలో బీజేపీకి త‌క్కువ‌గా సీట్లు ఉన్నాయి. అందుకే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. భ‌విష్య‌త్‌లో బీజేపీ బ‌లం పెరిగితే టీడీపీని ప‌క్క‌న పెడుతారు అని సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఉన్న‌ది చ‌ట్టాలు చేయ‌డానికే. ఆ చ‌ట్టాల‌ను అమ‌లు చేయాల్సింది రాష్ట్ర ప్ర‌భుత్వాలే. 2/3 మెజార్టీ వ‌చ్చినంత మాత్రాన అన్నీ చ‌ట్టాలు చేయ‌లేం. 2/3 మెజార్టీ ఉంద‌ని ప్ర‌ధానిగా ఉన్న వ్య‌క్తి తానే రాజున‌ని చ‌ట్టం చేసుకుంటే కుదురుతుందా..? ఏపీలో ప్ర‌తిప‌క్షానికి కేవ‌లం 11 సీట్లే ఉన్నాయి. తానే రాజున‌ని చంద్ర‌బాబు చ‌ట్టం తెస్తే ఒప్పుకుంటారా..? డిక్టేట‌ర్ షిప్‌ని ఎవ‌రూ ఒప్పుకోరు. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం.. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలి అని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

 

Advertisement
Advertisement