Cicada | రూపం మార్చుకున్న కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సికాడా
Cicada | ఆరేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి తాజాగా తన రూపాన్ని మార్చుకుంది. కొవిడ్-19 సబ్ వేరియంట్ BA.3.2 ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. దీనికి శాస్త్రవేత్తలు 'సికాడా' (Cicada)గా నామకరణం చేశారు.
Cicada | ఆరేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి తాజాగా తన రూపాన్ని మార్చుకుంది. కొవిడ్-19 సబ్ వేరియంట్ BA.3.2 ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. దీనికి శాస్త్రవేత్తలు 'సికాడా' (Cicada)గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది 20కిపైగా దేశాల్లో వెలుగు చూసింది. ముఖ్యంగా అమెరికా, దక్షిణాఫ్రికా, యూరప్ వంటి దేశాల్లో దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. భారత్‌లో ఇప్పటి వరకూ ఈ వేరియంట్ వ్యాప్తి గురించి ఎలాంటి ఆధారాలూ లేవు.
BA.3.2 అనేది గతంలో వెలుగుచూసిన ఒమిక్రాన్ (Omicron) కుటుంబానికి చెందినదే. కాకపోతే ఇది పాత ఒమిక్రాన్ కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్‌లో దాదాపు 70 నుంచి 75 వరకూ ఉత్పరివర్తనాలు (70-75 mutations) ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా వరకూ స్పైక్ ప్రొటీన్‌లోనే ఉన్నాయి. వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించేందుకు ఈ స్పైక్ ప్రొటీన్ కీలకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ముటేషన్ల వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఇది రోగనిరోధక శక్తిని కూడా కొంతవరకూ తప్పించుకోగలదట.
ఇవీ లక్షణాలు..
ప్రస్తుతానికి సికాడా లక్షణాలు పాత ఒమిక్రాన్ వేరియంట్‌లాగే ఉన్నాయి. జ్వరం, విపరీతమైన అలసట, తీవ్రమైన దగ్గు, ముక్కు కారడం, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ వంటివి లక్షణాలు. కొంతమందిలో తలనొప్పి, ఒళ్లు నొప్పులు, శ్వాసతీసుకోవడంలో కొంత అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. ఇతర వేరియంట్లతో పోలిస్తే BA.3.2 కారణంగా తీవ్రమైన అనారోగ్యం బారిన పడే సూచనలు లేవు. ఈ వేరియంట్ వల్ల ప్రమాదం పెరగడం గానీ, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రావడం గానీ జరుగుతున్నట్లు ఎక్కడా రుజువు కాలేదు. సాధారణ జలుబు, జ్వరం లాగే వచ్చి తగ్గిపోతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు.
ఆందోళన అవసరం లేదు..
ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతానికి భారత్‌లో ఈ వేరియంట్ కేసులు వెలుగు చూసినట్లు ఆధారాలు లేవు. ప్రస్తుతం దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు దీన్నుంచి రక్షణ కల్పిస్తాయని భావిస్తున్నారు. కొవిడ్ పాండమిక్ ప్రారంభ దశతో పోలిస్తే ప్రస్తుతం మనదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ చాలా మెరుగ్గా ఉడంటం ఊరటిచ్చే విషయం. అయితే, ఈ వేరియంట్ వ్యాప్తిపై అధికారులు నిఘా ఉంచారు.
జాగ్రత్తలు మస్ట్..
ఈ వేరియంట్ ప్రాణాంతకం కాకపోయినా కొన్ని జాగ్రత్తలు మస్ట్‌గా తీసుకోవాలి. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు మాస్కులు పెట్టుకోవడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం, దగ్గు ఎన్ని రోజులకూ తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులు వాడాలి. ప్రస్తుతానికి ఈ కొత్త వేరియంట్ వల్ల ప్రపంచానికి వచ్చే ముప్పేమీ లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిదని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం గ్లోబల్ హెల్త్ ఏజెన్సీలు, లాబొరేటరీలు 'సికాడ' (Cicada) వేరియంట్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది, అలాగే ప్రస్తుతం ఉన్న ఇతర వేరియంట్ల కంటే ఇది ప్రమాదకరమా..? అనే అంశాలను అర్థం చేసుకోవడానికి జెనోమిక్ సీక్వెన్సింగ్, ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలను నిర్వహిస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తమైంది. దీని వ్యాప్తిని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోంది.
Also Read..
స్పామ్ కాల్స్, మెసేజ్ లతో విసిగిపోయారా..? TRAI యాప్‌తో ఇలా పరిష్కారం పొందండి..
ఎల్లుండే లాస్ట్ డేట్.. ఫొటో, బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. కేవీకి దరఖాస్తు చేయొచ్చు..
ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం.. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు..!
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






