త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TRAI DND App | స్పామ్ కాల్స్‌, మెసేజ్ లతో విసిగిపోయారా..? TRAI యాప్‌తో ఇలా ప‌రిష్కారం పొందండి..

TRAI DND App | టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం వినియోగదారులకు కీలక సమాచారం ఇచ్చింది. ఇకపై వారు TRAI DND యాప్ ద్వారా తమ మొబైల్ నంబర్లను నమోదు చేసుకుని, ప్రమోషనల్ కాల్స్, SMSలపై తమ అభిరుచులను సులభంగా నియంత్రించవచ్చని తెలిపింది.

S

Technology | Published On Mar 31, 2026, 3.34 pm IST

TRAI DND App | స్పామ్ కాల్స్‌, మెసేజ్ లతో విసిగిపోయారా..? TRAI యాప్‌తో ఇలా ప‌రిష్కారం పొందండి..
Advertisement

TRAI DND App | టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం వినియోగదారులకు కీలక సమాచారం ఇచ్చింది. ఇకపై వారు TRAI DND యాప్ ద్వారా తమ మొబైల్ నంబర్లను నమోదు చేసుకుని, ప్రమోషనల్ కాల్స్, SMSలపై తమ అభిరుచులను సులభంగా నియంత్రించవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు ద్వారా వెల్లడించింది. ప్ర‌తి రోజూ స్పామ్ కాల్స్ స్వీక‌రించే వారు, అవ‌స‌రం లేని కాల్స్ లేదా SMS లు వ‌చ్చే వారు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని, వాటిని ఎలా ఆపాలో తెలియ‌క స‌త‌మ‌తం అవుతున్నార‌ని, అయితే కేవ‌లం బ్లాక్ చేస్తే స‌రిపోద‌ని, ఇందుకు మ‌రింత స‌మ‌ర్థ‌వంత‌మైన ప‌రిష్కారం అందుబాటులో ఉంద‌ని TRAI పేర్కొంది.

ప్ర‌మోష‌న‌ల్ కాల్స్‌, SMS ల‌పై నియంత్ర‌ణ‌..

కొన్ని క్లిక్‌లతోనే వినియోగదారులు తమ నంబర్‌ను నమోదు చేసుకుని, ఏ రకమైన కమ్యూనికేషన్ స్వీకరించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించవచ్చు. వినియోగదారులు తమకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే పొందేలా ఇది సహాయపడుతుంది. ఈ యాప్ సులభంగా, వేగంగా ఉపయోగించుకునే విధంగా అంద‌బాటులో ఉంది. రోజువారీ స్పామ్ వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ఈ యాప్ పనిచేస్తుంది. TRAI తన వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఈ యాప్ ద్వారా మొబైల్ వినియోగదారులు తమ DND అభిరుచులను నమోదు చేసుకోవచ్చు, నిర్వహించవచ్చు, అవసరమైతే మార్చుకోవచ్చు. దీని వల్ల వినియోగదారుల అనుమతి మేరకు మాత్రమే కమర్షియల్ కమ్యూనికేషన్ అందుతుంది. అయితే సేవలకు సంబంధించిన ముఖ్యమైన సందేశాలు మాత్రం య‌థావిధిగా వ‌స్తాయి.

ఎలా మార్చాలి..

TRAI అందుబాటులో ఉంచిన TRAI DND యాప్‌ను ముందుగా వినియోగ‌దారులు త‌మ ఫోన్ లో ఇన్‌స్టాల్ చేయాలి. అనంత‌రం యాప్‌ను ఓపెన్ చేయాలి. వినియోగ‌దారులు తాము స్వీక‌రించాల‌నుకునే లేదా నిరోధించాల‌నుకునే క‌మ్యూనికేష‌న్ విభాగాల‌ను ఎంపిక చేసుకోవాలి. త‌రువాత ఓటీపీ ద్వారా వెంట‌నే యాక్టివేష‌న్‌ను పూర్తి చేయాలి. దీంతో వినియోగ‌దారులు ఎంచుకున్న విధంగా DND ఆప్ష‌న్లు మారుతాయి. ఇక ఈ యాప్‌లో వినియోగ‌దారులు ఫిర్యాదు కూడా చేయ‌వ‌చ్చు. ఫిర్యాదు స్టేట‌స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేయ‌వ‌చ్చు. ఈ యాప్ లో న‌మోద‌య్యే ప్ర‌తి ఫిర్యాదు స్పామ‌ర్ల‌ను గుర్తించ‌డానికి స‌హాయ ప‌డుతుంద‌ని TRAI తెలియ‌జేసింది. 2025లో అన‌వ‌స‌ర కాల్స్‌, మెసేజ్‌ల‌ను నియంత్రించేందుకు 1,84,482 టెలికాం క‌నెక్ష‌న్ల‌ను నిలిపివేశామ‌ని TRAI తెలిపింది.

TRAI కు చెందిన TRAI DND యాప్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌ల‌పై వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంది. దీన్ని ఆండ్రాయిడ్ వినియోగ‌దారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ యూజ‌ర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ యాప్ ద్వారా వినియోగ‌దారులు స్పామ్ కాల్స్ లేదా మెసేజ్‌ల‌కు పూర్తిగా అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement