త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WHO | డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అమెరికా

WHO | ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) (WHO) నుంచి అమెరికా (America) అధికారికంగా వైదొలిగింది. అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి తాము వైదొలుగుతామ‌ని ప‌లుమార్లు ప్ర‌క‌టించారు. డ‌బ్ల్యూహెచ్‌వోకు ప్ర‌తీ ఏటా అమెరికా అందించే 500 మిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక స‌హాయాన్ని నిలిపివేశారు.

A

International | Published On Jan 23, 2026, 3.49 pm IST

WHO | డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అమెరికా
Advertisement

WHO | త్రినేత్ర‌.న్యూస్‌ : ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) (WHO) నుంచి అమెరికా (America) అధికారికంగా వైదొలిగింది. అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి తాము వైదొలుగుతామ‌ని ప‌లుమార్లు ప్ర‌క‌టించారు. డ‌బ్ల్యూహెచ్‌వోకు ప్ర‌తీ ఏటా అమెరికా అందించే 500 మిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక స‌హాయాన్ని నిలిపివేశారు. డ‌బ్ల్యూహెచ్‌వో చైనా ప్ర‌భావంలో ఉంద‌ని, అందుకే క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ట్రంప్ ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేశారు. డ‌బ్ల్యూహెచ్‌వోలో మొత్తం 194 స‌భ్య‌దేశాలు ఉన్న‌ప్ప‌టికీ నిధుల స‌మీక‌ర‌ణ‌లో అమెరికా 16-18 శాతం నిధుల‌ను భ‌రించేది. ట్రంప్ మొద‌టి సారి అధికారంలోకి వ‌చ్చిన‌పుడే డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగే ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. కానీ, మ‌ధ్య‌లో అధికారంలోకి వ‌చ్చిన బైడెన్ ప్ర‌భుత్వం దానిని నిలిపివేసింది. తిరిగి ట్రంప్ అధికారంలోకి రావ‌డంతో దానిని మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించారు.

అమెరికా నిర్ణ‌యం డ‌బ్ల్యూహెచ్‌వో ఆర్థిక ప‌రిస్థితిని కుదిపేస్తుంది. వివిధ మ‌హ‌మ్మారులు, టీకాల పంపిణీల‌లో కూడా ఇబ్బందులు ఎదురుకానున్నాయి. భార‌త్‌తో పాటు అనేక దేశాలు ఈ నిర్ణ‌యంతో ప్ర‌భావిత‌మ‌వుతాయి. డ‌బ్ల్యూహెచ్‌వోకు ఆర్థికంగా చైనా, యూరోపియ‌న్ యూనియ‌న్ అండ‌గా నిల‌బ‌డ‌తాయ‌ని నిపుణులు భావిస్తున్నారు. ఇది భ‌విష్య‌త్ ఆరోగ్య సంక్షోభాల్లో అంత‌ర్జాతీయ స‌మ‌న్వ‌యాన్ని బ‌ల‌హీన‌ప‌రుస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement