BJP | మే 9న బెంగాల్ నూతన సీఎం ప్రమాణ స్వీకారం : బీజేపీ
BJP | పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు బీజేపీ మంగళవారం కీలక ప్రకటన చేసింది. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని మే 9వ తేదీన నూతన సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని స్పష్టం చేసింది.
BJP | ప్రతిపక్షాల కంచుకోటను బీజేపీ (BJP) బద్దలు కొట్టింది. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు కాషాయ పార్టీ ఘనంగా ముగింపు పలికింది. 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 206 స్థానాల్లో జయభేరి మోగించి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బెంగాల్ రాష్ట్రంలో కమలం పార్టీ తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు (New Bengal govt) సిద్ధమైంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ నెల 9న బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ తాజాగా కీలక ప్రకటన చేసింది. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ (Rabindranath Tagore) జయంతిని పురస్కరించుకుని మే 9వ తేదీన కోల్‌కతాలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య (Samik Bhattacharya) ప్రకటించారు.
కాగా, బారక్‌పూర్‌లో జరిగిన తన చివరి ఎన్నికల ప్రచార సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజున బీజేపీ నేతృత్వంలో కొత్త బెంగాల్ ఆవిర్భవిస్తుందని అప్పుడు ప్రకటించారు. "మే 4న వెలువడే ఫలితాల తర్వాత.. బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను మళ్ళీ వస్తాననే నమ్మకంతో తిరిగి వెళ్తున్నాను" అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక సోమవారం బెంగాల్ ఫలితాలు వెలువడిన అనంతరం.. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ మరోసారి ఠాగూర్‌ను స్మరించుకున్నారు. ఠాగూర్ కలలుగన్న ‘భయమెరుగని, తల ఎత్తుకుని జీవించే సమాజాన్ని’ బెంగాల్‌లో నిర్మించడమే తమ పార్టీ సంకల్పమని ప్రధాని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో అధికార మార్పిడికి సంబంధించిన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ఎస్.బి. జోషి, సుజిత్ కుమార్ మిశ్రా నేడు కోల్‌కతా వెళ్లారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్‌కు అందించనున్నారు. అనంతరం మే 6న ప్రధాన ఎన్నికల అధికారి అధికారికంగా గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలిసి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక సీఎం పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించనున్నారు.
Also Read..
మోదీకి ఇక తిరుగులేదు.. టీవీకే దెబ్బకు డీఎంకే విలవిల.. ఎన్నికల ఫలితాలపై పాశ్చాత్య మీడియా
డీఎంకే ఓటమి.. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా
పనిమనిషి నుంచి ఎమ్మెల్యే స్థాయికి.. బెంగాల్ ఎన్నికల్లో ఆసక్తికరంగా మహిళ గెలుపు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






