MK Stalin | డీఎంకే ఓటమి.. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా
MK Stalin | సీఎం పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా చేశారు. నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపారు.
MK Stalin | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే (DMK) ఘోర ఓటమి తర్వాత సీఎం పదవికి ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ (MK Stalin) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ (Tamil Nadu Governor) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar)కు పంపారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మరోవైపు ఈ ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ తిరుగులేని విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ విజయ్ (Actor Vijay) గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, ఇతర పార్టీలతో పొత్తు అంశాలపై వారితో చర్చిస్తున్నారు.
స్టాలిన్‌కు ఓటమి రుచి చూపించిన డీఎంకే మాజీ నేత..
ఇక ఈ ఎన్నికల్లో సీఎం స్టాలిన్‌కు చుక్కెదురైంది. చెన్నై కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్.. తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల్లో బాబుకు 88,180 ఓట్లు రాగా.. స్టాలిన్‌కు 72,988 ఓట్లు వచ్చాయి. చెన్నై ప్రాంతం సంప్రదాయంగా డీఎంకే బలమైన కంచుకోటగా భావిస్తారు. అయితే, ఈసారి అక్కడే పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
స్టాలిన్ 2011 నుంచి కొళత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన.. తన పట్టును నిలుపుకున్నారు. 2016లో 51.4 శాతం ఓట్లతో సులభంగా గెలిచిన స్టాలిన్.. 2021లో 1,05,522 ఓట్లు సాధించి 61.4 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా ఓటమి చవిచూడటం గమనార్హం.
కాగా, 234 సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. నిన్న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఊహించిన రీతిలో భారీ విజయం నమోదు చేసింది. ఏకంగా 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు కొద్దిదూరంలోనే ఆగిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మద్దతుకోరే పనిలో పడ్డారు విజయ్.
Also Read..
మోదీకి ఇక తిరుగులేదు.. టీవీకే దెబ్బకు డీఎంకే విలవిల.. ఎన్నికల ఫలితాలపై పాశ్చాత్య మీడియా
పనిమనిషి నుంచి ఎమ్మెల్యే స్థాయికి.. బెంగాల్ ఎన్నికల్లో ఆసక్తికరంగా మహిళ గెలుపు
గోల్డ్ శారీ, డైమండ్స్ బ్లౌజ్.. మెట్‌గాలాలో ఈషా అంబానీ మెరుపులు
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



