Local Train | దేశంలోనే తొలిసారి.. పట్టాలెక్కనున్న క్లోజ్డ్ డోర్ నాన్ ఏసీ లోకల్ రైలు
Local Train | ముంబై (Mumbai) లోకల్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. దేశంలోనే మొట్టమొదటి క్లోజ్డ్-డోర్ నాన్ ఏసీ లోకల్ రైలు (Closed Door Non AC Local Train) అందుబాటులోకి రానుంది.
Local Train | ముంబై (Mumbai) లోకల్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. దేశంలోనే మొట్టమొదటి క్లోజ్డ్-డోర్ నాన్ ఏసీ లోకల్ రైలు (Closed Door Non AC Local Train) అందుబాటులోకి రానుంది. ముంబై లోకల్ రైళ్లు ఎంత రద్దీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం లక్షలాది మంది ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణిస్తున్నప్పుడు కొందరు ప్రయాణికులు జారి పట్టాలపై పడిన ఘటనలు ఇటీవలే వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రద్దీగా ఉండే రైళ్ల నుంచి ప్రయాణికులు జారిపడి జరిగే ప్రమాదాలను నివారించడంతో పాటు తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారి క్లోజ్డ్ డోర్ నాన్ ఏసీ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
ప్రస్తుతం ముంబైలో కేవలం ఖరీదైన ఏసీ లోకల్ రైళ్లకు మాత్రమే ఆటోమేటిక్ క్లోజ్డ్ డోర్ సిస్టమ్ ఉంది. అయితే, సాధారణ తరగతి ప్రయాణికులకు కూడా ఏసీ రైళ్ల తరహా భద్రతను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న రైలును రూపొందించారు. ఇందులో ఏసీ లేనప్పటికీ, ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా 'ఫోర్స్డ్ వెంటిలేషన్ సిస్టమ్' అనే అధునాతన సాంకేతికతను అమర్చారు. ఈ వ్యవస్థ రైలు డోర్లు మూసి ఉన్నా కూడా కోచ్‌లలోకి నిరంతరం స్వచ్ఛమైన గాలిని పంపింగ్ చేస్తుంది. తద్వారా సాధారణ రైళ్ల కంటే ఎక్కువ గాలి ప్రసరణ జరిగి, లోపల వాతావరణం చల్లగా ఉంటుంది.
అంతేకాదు ఈ రైలు ప్రమాదాలను కూడా నివారిస్తుంది. రద్దీగా ఉండే లోకల్ రైళ్లలో తలుపులు తెరిచి ఉంచడం వల్ల ప్రయాణికులు కింద పడిపోయి ప్రమాదాలు బారిన పడుతుంటారు. అలాంటి ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా క్లోజ్డ్ డోర్ రైలును ప్రవేశపెడుతున్నారు. ఏసీ రైళ్లలో ఉండే అధిక ఛార్జీల భారం లేకుండా.. సాధారణ తరగతి ప్రయాణికులకు కూడా సురక్షితమైన ప్రయాణాన్ని అందించేలా దీన్ని రూపొందించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇందులో మరిన్ని ఆధునిక సదుపాయాలు కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో గార్డు లేదా మోటార్‌మ్యాన్‌తో మాట్లాడేందుకు 'టాక్-బ్యాక్' సిస్టమ్, మెరుగైన సీటింగ్ అమరిక, ఎల్ఈడీ లైటింగ్, రాబోయే స్టేషన్ల వివరాలను ప్రదర్శించే జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేశారు. ఈ రైలు టికెట్ ధరలు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. కానీ ఏసీ లోకల్ రైలు ఛార్జీల కంటే గణనీయంగా తక్కువగా, సాధారణ ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ ధరలకు దగ్గరగా ఉండొచ్చని సమాచారం. త్వరలోనే ముంబై సబర్బన్ ట్రాక్‌లపై ఈ రైలు ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ట్రయల్స్ విజయవంతమైతే ముంబై జీవనాడి అయిన లోకల్ రైళ్లను అధునీకరించే ప్రణాళికలో భాగంగా మరిన్ని రైళ్లను తీకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది.
First look! The first non-AC closed door rake has arrived in #Mumbai. The Kurla Carshed of @Central_Railway got this first rake from ICF Chennai on Monday evening. @HT_Mumbai pic.twitter.com/5ViWCQeaU6
— Shashank Rao (@Shashankrao06) April 13, 2026
Also Read..
బ్యాంకుల్లో తగ్గుతున్న డిపాజిట్లు.. ఆర్‌బీఐ అత్యవసర సమావేశాలు..
డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం : మండలి చైర్మన్ గుత్తా
తాజావార్తలు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ నుంచి నీటి సరఫరా
- ●Samula Ram Reddy | బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డికి సన్మానం
- ●KCR | కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర
- ●S Jaishankar Munich Security Conference | అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా మారుతున్న అమెరికా
- ●CM Vijay | మహిళల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోం.. స్టాలిన్‌కు విజయ్ హెచ్చరిక

Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Uttam Kumar Reddy | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ నుంచి నీటి సరఫరా

Samula Ram Reddy | బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డికి సన్మానం

KCR | కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర






