త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!

లక్షలు ఖర్చుపెట్టి ఐఐటీలో చదివినా ఉద్యోగాలు రావడం లేదు. ఏకంగా 30-40 శాతం మందికి ప్లేస్‌మెంట్స్ లేవు. డిగ్రీల కంటే స్కిల్స్ ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం రండి.

J

National | Published On Aug 12, 2026, 10.00 pm IST

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!

సంక్షిప్త సారాంశం

2024-25 ప్లేస్‌మెంట్ సీజన్‌లో దేశంలోని పలు టాప్ ఐఐటీల్లో 30 నుంచి 40 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదు. ఐఐటీ ఢిల్లీలో 61% మందికే జాబ్స్ రాగా, 738 మంది ఇంకా ఆఫర్స్ లేకుండా మిగిలిపోయారు. అటు ఐఐటీ గాంధీనగర్‌లోనూ 59% మందికి ప్లేస్‌మెంట్ రాలేదు. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ప్రకారం, దేశంలో గ్రాడ్యుయేట్ల ఎంప్లాయబిలిటీ 55 శాతంగా మాత్రమే ఉంది. జనరేటివ్ ఏఐ (Generative AI) టూల్స్ రాక, గ్లోబల్ టెక్ రంగంలో హైరింగ్ తగ్గడం వల్ల కంపెనీలు డిగ్రీల కంటే స్పెసిఫిక్ స్కిల్స్‌ ఉన్నవారికే పెద్దపీట వేస్తున్నాయి.

Advertisement

IIT Placements Crisis | త్రినేత్ర.న్యూస్ : ఒకప్పుడు ఐఐటీ (IIT) లో సీటు వస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అని భావించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వేగంగా మారుతోంది. 2024-25 అకడమిక్ సైకిల్ ముగిసే సమయానికి దేశంలోని పలు టాప్ ఐఐటీల్లో దాదాపు 30-40 శాతం మంది విద్యార్థులకు ఇంకా ఉద్యోగాలు రాలేదు. ఇటీవల ఎక్స్ (X) వేదికగా ఓ 22 ఏళ్ల యువకుడు పెట్టిన పోస్ట్ ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసిన ఆ డ్రాపౌట్ (Dropout), తాను ప్రస్తుతం నెలకు సుమారు రూ. 4.86 లక్షలు సంపాదిస్తున్నానని, ఐఐటీ డిగ్రీ అనేది కేవలం ఓ "ట్యాగ్" మాత్రమేనని చెప్పడం వైరల్‌గా మారింది. ఇంతకీ ఉన్నత విద్యా వ్యవస్థలో అసలేం జరుగుతోంది?

విద్యా వ్యవస్థలో విస్తరణ.. కానీ ఉద్యోగాలేవి?

గతంతో పోలిస్తే విద్యా రంగంలో ఎన్‌రోల్‌మెంట్స్ (enrolments) భారీగా పెరిగాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన AISHE 2021-22 సర్వే ప్రకారం.. 2014-15 నాటికి 3.42 కోట్లుగా ఉన్న ఎన్‌రోల్‌మెంట్స్, 2021-22 నాటికి 4.33 కోట్లకు చేరుకున్నాయి. అంటే పదేళ్లలో ఏకంగా 91 లక్షల మంది పెరిగారు. అలాగే గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (GER) 23.7% నుంచి 28.4% కు పెరిగింది. ముఖ్యంగా వరుసగా ఐదేళ్లుగా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా కాలేజీల్లో చేరుతుండటం (Gender Parity Index 1 కంటే ఎక్కువ నమోదు కావడం) సానుకూల పరిణామం.

కానీ, డిగ్రీలు పూర్తి చేస్తున్నవారు ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్‌ను మాత్రం అందిపుచ్చుకోలేకపోతున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ ఎన్‌రోల్‌మెంట్‌లో 34.2 శాతం మంది ఆర్ట్స్ (Arts) తీసుకుంటుండగా, ఆ తర్వాత సైన్స్ 14.8%, కామర్స్ 13.3%, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 11.8% చదువుతున్నారు. 'ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026' ప్రకారం, దేశంలో గ్రాడ్యుయేట్ల ఓవరాల్ ఎంప్లాయబిలిటీ (Employability) 55 శాతం మాత్రమే ఉంది. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఐటీ విద్యార్థులకు 78-80% అర్హత ఉండగా, కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు 70%, పాలిటెక్నిక్ డిప్లొమా వారికి 32.9%, ఐటీఐ (ITI) వారికి 46 శాతం కంటే తక్కువ ఎంప్లాయబిలిటీ ఉంది.

మరోవైపు 2,700 క్యాంపస్‌లలో సర్వే చేసిన 'మెర్సెర్-మెట్ల్ ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ 2025' నివేదిక.. దేశంలో ఓవరాల్ ఎంప్లాయబిలిటీ కేవలం 42.6 శాతంగానే ఉందని తేల్చింది. టెక్నికల్ స్కిల్స్ కంటే కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్ లాంటి సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడమే విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది.

మూతపడుతున్న కాలేజీలు

ఏఐసీటీఈ (AICTE) కేవలం 2025-26 అకడమిక్ ఇయర్‌లోనే 58 ఇంజనీరింగ్, టెక్నికల్ కాలేజీలను మూసివేసింది. అంతేకాకుండా 950కి పైగా టెక్నికల్ కోర్సులను సైతం రద్దు చేసింది. విద్యార్థులు రాకపోవడం, సరైన ఫ్యాకల్టీ లేకపోవడమే ఇందుకు కారణం. 2019 నుంచి ఇప్పటివరకు 5.62 లక్షల ఇంజనీరింగ్ సీట్లు రద్దయినట్లు గతంలో కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది.

ఐఐటీ టాపర్ల పరిస్థితి ఎందుకిలా?

ఒకప్పుడు 'జేఈఈ' (JEE) క్రాక్ చేస్తే భారీ ప్యాకేజీ వస్తుందనే గ్యారెంటీ ఉండేది. కానీ ఆ రోజులు పోయాయి. 2024-25 సైకిల్‌లో ఐఐటీ ఢిల్లీలో కేవలం 61% మందికే ఉద్యోగాలు రాగా, ఇంకా 738 మంది ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ఐఐటీ గాంధీనగర్‌లో 59% మందికి, ఐఐటీ తిరుపతిలో 46% మందికి, ఐఐటీ ఇండోర్‌లో 44% మందికి ఇంకా ప్లేస్‌మెంట్స్ దక్కలేదు. ఐఐటీ ధార్వాడ్, ఐఎస్‌ఎం ధన్‌బాద్, హైదరాబాద్, బీహెచ్‌యూ, రోపర్, ఖరగ్‌పూర్ వంటి ప్రతిష్టాత్మక క్యాంపస్‌లలో కూడా ప్లేస్‌మెంట్ సీజన్ ముగుస్తున్నా 30 నుంచి 40 శాతం మందికి ఉద్యోగాలు రాలేదు.

దీనికి ప్రధాన కారణం.. గ్లోబల్ టెక్ రంగంలో నియామకాలు మందగించడం, అలాగే జనరేటివ్ ఏఐ (Generative AI) టూల్స్ రాకతో కోడింగ్, అనలిటికల్ పనులను అవే చేసేయడం. దీంతో కంపెనీలు జనరల్ డిగ్రీ ఉన్నవారి కంటే.. ఏఐ, డేటా, ఆటోమేషన్ వంటి స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్నవారినే ఎంచుకుంటున్నాయి.

ముందున్న మార్గం ఏంటి?

ఉన్నత విద్యా వ్యవస్థ కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే ఫ్యాక్టరీల్లా కాకుండా, విద్యార్థులకు మార్కెట్ డిమాండ్‌కు తగ్గ స్కిల్స్ నేర్పించేలా మారాలి. ఐఐటీలు సహా విద్యాసంస్థలన్నీ తమ ప్లేస్‌మెంట్ డేటాను పారదర్శకంగా థర్డ్ పార్టీ ద్వారా పబ్లిక్ చేయాలి. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్ (Curriculum) మార్పులు ఉండాలి. కేవలం టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏఐ నైపుణ్యాలను కోర్ కరిక్యులమ్‌లో భాగం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే లక్షల రూపాయలు వెచ్చించి చదివినా ప్రయోజనం శూన్యం.

Advertisement

తాజావార్తలు

Advertisement