Supreme Court | విద్యార్థినులకు బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాల్సిందే..!
Supreme Court | దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థినులకు టాయిలెట్లతో పాటు అన్ని వసతులు కల్పించాలని స్వరోన్నత న్యాయస్థానం రాష్ట్రాలను ఆదేశించింది. పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్‌ను సైతం అందుబాటులో ఉంచాలని చెప్పింది.
- టాయిలెట్లలో అన్ని వసతులు కల్పించాలి
- మెనుస్ట్రవల్ హైజిన్ జీవించే, గోప్యత హక్కుల్లో భాగమే
- దివ్యాంగ విద్యార్థులకు అనుకూల ఏర్పాట్లు ఉండాలి
- ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాట్లు చేయకుంటే గుర్తింపు రద్దు
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Supreme Court | తినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థినులకు టాయిలెట్లతో పాటు అన్ని వసతులు కల్పించాలని స్వరోన్నత న్యాయస్థానం రాష్ట్రాలను ఆదేశించింది. పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్‌ను సైతం అందుబాటులో ఉంచాలని చెప్పింది. పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు, పారిశుధ్య సదుపాయాలు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అన్ని పాఠశాలల్లో విద్యార్థినులకు బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్కిన్స్ ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కు, గోప్యత హక్కులో మెనుస్ట్రవల్ హైజిన్ సైతం భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి పాఠశాలలో బాలికలు, బాలురకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండాలని చెప్పింది.
గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరికలు..
అలాగే, దివ్యాంగ విద్యార్థులకు సైతం వారికి అనుకూలమైన టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆదేశాలను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటి తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాలికలు, బాలురకు వేర్వేరు మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోయినా.. విద్యార్థులకు ఉచిత శానిటరీ ప్యాడ్లు అందించకపోతే ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తే అవకాశం ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. మెనుస్ట్రవల్ హైజిన్ అనేది ప్రభుత్వ విధానాలపై ఆధారపడే విషయం కాదని.. గౌరవంగా జీవించే హక్కు అని ధర్మాసనం అభిప్రాయపడింది. బాలికలకు మరుగుదొడ్లు, ఉచిత శానిటరీ ప్యాడ్లు కల్పించడంలో విఫలమైతే ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిందేనని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల్లో లోపాల కారణంగా మెనుస్ట్రవల్ హైజిన్ కారణంగా బాలికల ఆరోగ్యం, చదువు, గోప్యపై నేరుగా ప్రభావం చూపుతున్నట్లుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పరిస్థితి మారాలంటే సమాజం దృక్పథం మారాల్సిన అవసరం ఉందని ఉందని నొక్కి చెప్పింది. వాస్తవానికి ఈ కేసు గత ఏడాది నవంబర్‌లో హర్యానాలోని మహర్షి దయానంద యూనివర్సిటీ ఘటనతో మొదలైంది.
కేసు వివరాలు ఇవీ..
గత నవంబర్‌లో హర్యానాలోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ముగ్గురు మహిళా పారిశుధ్య కార్మికులను తాము పీరియడ్స్ కారణంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నట్లుగా అధికారులకు తెలిపారు. అయితే, నిజంగా పీరియడ్స్ ఉన్నట్లుగా నిరూపించేందుకు శానిటరీ ప్యాడ్స్ ఫొటోలు పంపాలని ఉన్నతాధికారులు బలవంతం చేశారు. ఈ వ్యవహారం ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ఉన్నతాధికారులను ఇద్దరి అధికారులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఉన్నతాధికారులపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో ఇలాంటి చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది.
తీవ్రమైన హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న సుప్రీంకోర్టు..
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన కోర్టు, మహిళలు, బాలికలు అవమానకరమైన పరిస్థితులపై ఆ పిటిషన్‌లో ప్రస్తావించినట్లు తెలిపింది. ఇలాంటి చర్యలు ఆర్టికల్ 21 కింద ఉన్న జీవించే హక్కు, గౌరవం, గోప్యత, శరీర హక్కులకు తీవ్ర ఉల్లంఘన అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) తన పిటిషన్‌లో పేర్కొంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే మహిళా కార్మికులకు మెనుస్ట్రవల్ హైజిన్ సమయంలో గౌరవప్రదమైన పని పరిస్థితులు కల్పించాల్సిన హక్కు ఉందని స్పష్టం చేసింది. రుతుస్రావం సమయంలో పనులు చేయకపోతే ఇలాంటి తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, బాధ్యులైన ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్లు హర్యానా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
Read Also :
Bank Holidays | ఫిబ్రవరిలో బ్యాంకులకు తొమ్మిది రోజులు సెలవులు..!
Venus Transit 2026 | మీనరాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశులవారికి లాభాలే..!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






