త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venus Transit 2026 | మీన‌రాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశుల‌వారికి లాభాలే..!

Venus Transit 2026 | వేద జ్యోతిష‌శాస్త్రంలో గ్ర‌హాల సంచారానికి ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న‌ది. శుక్ర గ్రహాన్ని అందం, సౌకర్యం, భౌతిక ఆనందం, వివాహం, ఐశ్వర్యం, కళలు, సంపద, ప్రేమకు కార‌కంగా పేర్కొంటారు. శుక్రుడిలో క‌లిగే మార్పులు దేశం, ప్ర‌పంచంపైనే కాకుండా 12రాశుల‌వారిపై ప్ర‌భావం ప‌డుతుంది.

P

Horoscope | Published On Jan 30, 2026, 6.40 am IST

Venus Transit 2026 | మీన‌రాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశుల‌వారికి లాభాలే..!
Advertisement

Venus Transit 2026 | వేద జ్యోతిష‌శాస్త్రంలో గ్ర‌హాల సంచారానికి ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న‌ది. శుక్ర గ్రహాన్ని అందం, సౌకర్యం, భౌతిక ఆనందం, వివాహం, ఐశ్వర్యం, కళలు, సంపద, ప్రేమకు కార‌కంగా పేర్కొంటారు. శుక్రుడిలో క‌లిగే మార్పులు దేశం, ప్ర‌పంచంపైనే కాకుండా 12రాశుల‌వారిపై ప్ర‌భావం ప‌డుతుంది. మార్చి నెల‌లో శుక్రుడు త‌న ఉచ్ఛ‌రాశి అయిన మీన‌రాశిలోకి ప్ర‌వేశించ‌నున్నాడు. కొన్ని రాశుల‌వారిపై ప్ర‌త్యేక ప్ర‌భావం క‌నిపిస్తుంది. కెరీర్‌, వ్యాపారంలో లాభాలు, పురోగ‌తికి అవ‌కాశాలుంటాయి. మీన‌రాశిలో సంచారంతో ప‌లురాశుల‌వారి అదృష్టం రానుండ‌గా.. ఆ రాశులేంటో తెలుసుకుందాం..!

క‌ర్కాట‌క రాశి..

శుక్రుడి సంచారం క‌ర్కాట‌క రాశి వారికి చాలా ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. మార్చి నెలలో శుక్రుడు మీ అదృష్ట స్థానంలో సంచరిస్తాడు. ఈ సంచారంతో మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిష్ట, గౌరవం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. విద్యార్థులు విద్యలో, పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవ‌కాశాలు గోచ‌రిస్తున్నాయి.

మ‌క‌ర రాశి..

శుక్రుడి సంచారం మ‌క‌ర రాశివారికి చాలా శుభ‌ప‌ద్రంగా, సానుకూలంగా ఉంటుంది. ఈ గ్ర‌హ సంచారం కార‌ణంగా ధైర్యాన్ని పెంచుతుంది. మీరు కెరీర్‌, వ్యాపారంలో మంచి లాభాల‌ను చూస్తారు. ఆస్తి సంబంధిత విషయాల్లో మీరు కొన్ని శుభ‌వార్త‌ల‌ను వింటారు. అసంపూర్తిగా ఉన్న పనులు ఇప్పుడు సమయానికి పూర్తవుతాయి. ఇది మిమ్మల్ని చాలా స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కిస్తుంది.

మీన రాశి

శుక్రుడి సంచారంతో మీన‌రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. కొత్త అవ‌కాశాలు ల‌భిస్తాయి. శుక్రుడు మీ జాత‌కంలోని ల‌గ్న‌స్థానంలో సంచ‌రించ‌నున్నాడు. దాతో మీ వ్య‌క్తిత్వం మ‌రింత మెరుగ‌వుతుంది. ఈ స‌మయంలో మీ కుటుంబ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో కొత్త‌ద‌నం ఉంటుంది. పెళ్లికాని వారికి వివాహ ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఈ కాలంలో అన్ని ర‌కాల భౌతిక సౌక‌ర్యాలు పెరుగుతాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement