త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bank Holidays | ఫిబ్ర‌వ‌రిలో బ్యాంకుల‌కు తొమ్మిది రోజులు సెల‌వులు..!

Bank Holidays | ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో మ‌రో మాసం ముగిసింది. ఫిబ్ర‌వరి మాసం మొద‌లుకానున్న‌ది. రాబోయే నెల‌లు బ్యాంకులు తొమ్మిది రోజుల పాటు బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. ఈ మేర‌కు సెల‌వుల జాబితాను రిజ‌ర్వ్ బ్యాంక్ ఇండియా విడుద‌ల చేసింది.

P

Business | Published On Jan 30, 2026, 1.45 pm IST

Bank Holidays | ఫిబ్ర‌వ‌రిలో బ్యాంకుల‌కు తొమ్మిది రోజులు సెల‌వులు..!
Advertisement

Bank Holidays | ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో మ‌రో మాసం ముగిసింది. ఫిబ్ర‌వరి మాసం మొద‌లుకానున్న‌ది. రాబోయే నెల‌లు బ్యాంకులు తొమ్మిది రోజుల పాటు బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. ఈ మేర‌కు సెల‌వుల జాబితాను రిజ‌ర్వ్ బ్యాంక్ ఇండియా విడుద‌ల చేసింది. రెండు, నాలుగో శ‌నివారాలు, ఆదివారాలు క‌లుపుకొని సెల‌వుల ఆధారంగా బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. మ‌రో వైపు బ్యాంకులు పని చేయకపోయినా మొబైల్‌, ఇంటర్‌నెట్‌, యూపీఐ తదితర బ్యాంకు సేవలు కొన‌సాగ‌నున్నాయి. అయితే, కొన్ని పనుల కోసం తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ల‌క త‌ప్ప‌దు. ముందస్తుగా సెలవుల గురించి తెలుసుకుంటే ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే పనులు పూర్తి చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఏటీఎం నుంచి మీ బ్యాంకు అకౌంట్లో క్యాష్ విత్ డ్రా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ బ్యాంకు సెలవు రోజుల్లో చెక్ క్లియరెన్స్, డ్రాఫ్ట్‌లు, లాకర్ సంబంధిత పనులు, బ్రాంచ్ కౌంటర్ లావాదేవీలు మాత్రం చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

బ్యాంకు సెల‌వుల జాబితా..

ఫిబ్రవరి 1న ఆదివారం సంద‌ర్భంగా సెల‌వు.
ఫిబ్రవరి 8న ఆదివారం సంద‌ర్భంగా హాలీడే.
ఫిబ్రవరి 14న రెండోశ‌నివారం సంద‌ర్భంగా సెల‌వు.
ఫిబ్రవరి 15న ఆదివారం ఆదివారం సంద‌ర్భంగా బ్యాంకుల‌కు హాలీడే.
ఫిబ్రవరి 18న సిక్కింలోని లోసర్ సంద‌ర్భంగా బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి.
ఫిబ్రవరి 19న మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి హాలీడే.
ఫిబ్రవరి 20న అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా సెల‌వు.
ఫిబ్రవరి 22న ఆదివారం సంద‌ర్భంగా హాలీడే.
ఫిబ్రవరి 28న నాలుగో శ‌నివారం సంద‌ర్భంగా సెల‌వులు.

Advertisement

తాజావార్తలు

Advertisement