IMD | ముందే వస్తున్న రుతుపవనాలు.. ఈ నెల 14 -16 మధ్య అండమాన్‌ను తాకనున్న నైరుతి
IMD | దేశంలో మే నెల వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక అంచనాలను వెల్లడించింది. ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువగా హీట్‌వేవ్స్ (Heat Waves) నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించిన ఐఎండీ.. రుతుపవనాలకు (Monsoon) సంబంధించి కూడా చల్లని కబురు అందించింది.
IMD | త్రినేత్ర.న్యూస్: దేశంలో మే నెల వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక అంచనాలను వెల్లడించింది. ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువగా హీట్‌వేవ్స్ (Heat Waves) నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించిన ఐఎండీ.. రుతుపవనాలకు (Monsoon) సంబంధించి కూడా చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అవి ఈనెల 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ దీవులను (Andaman Nicobar Islands) తాకొచ్చని చెప్పింది. ఇది సాధారణ సమయం కంటే కొంచెం ముందే కావడం గమనార్హం. దీంతో మేలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
రుతు పవనాల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
ఎక్కువ వేడి..
మరోవైపు మే నెలలో పగటిపూట మాత్రమే కాదు, రాత్రి సమయాల్లోనూ వేడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా లేదా అంతకంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సముద్రపు తేమతో కూడిన వేడి గాలి వల్ల ఎక్కువ ఉక్కపోత ఉండొచ్చని తెలిపింది. హిమాలయ ప్రాంత రాష్ట్రాలు, తూర్పు తీర రాష్ట్రాలు, గుజరాత్, మహారాష్ట్రలో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. దీంతో రాత్రి వేళల్లో కూడా వేడి నుంచి పెద్దగా ఉపశమనం ఉండకపోవచ్చని తెలిపింది. అయితే, వాయవ్య భారతం, మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, ద్వీపకల్ప ప్రాంతాల సమీప ప్రాంతాలు, ఈశాన్య భారత దక్షిణ భాగాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం లేదా తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది.
Also Read..
మేలో సాధారణం కంటే ఎక్కువగానే హీట్‌వేవ్స్.. హెచ్చరించిన భారత వాతావరణశాఖ..!
భారతదేశపు ఉల్లిగడ్డల రాజధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
నేడు మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగనుంది.. భయపడిపోకండి!
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






