త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Onion Capital of India | భార‌త‌దేశ‌పు ఉల్లిగ‌డ్డ‌ల రాజ‌ధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?

Onion Capital of India | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయ‌దు అని అంటారు. దేశంలో ఉల్లిగ‌డ్డ (Onion) లేకుండా కూర ఉండ‌దు. ఉల్లి ఉప‌యోగించ‌ని వంట‌క‌మే ఉండ‌దు. వంట‌కం ఏదైనా ఆ రెసిపీలో ఉల్లి వాస‌న ఉండాల్సిందే.

G

National | Published On May 2, 2026, 7.40 am IST

Onion Capital of India | భార‌త‌దేశ‌పు ఉల్లిగ‌డ్డ‌ల రాజ‌ధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
Advertisement

Onion Capital of India | త్రినేత్ర‌.న్యూస్‌: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయ‌దు అని అంటారు. దేశంలో ఉల్లిగ‌డ్డ (Onion) లేకుండా కూర ఉండ‌దు. ఉల్లి ఉప‌యోగించ‌ని వంట‌క‌మే ఉండ‌దు. వంట‌కం ఏదైనా ఆ రెసిపీలో ఉల్లి వాస‌న ఉండాల్సిందే. రుచి కోసం మ‌సాలా ఘాటు ఎంత‌గా ద‌ట్టించినా.. ఉల్లి లేకుండా తిన‌లేమ‌నేది నిజం. అందుకే భార‌త్‌లో ఉల్లికి భారీ డిమాండ్ ఉంటుంది. దానికి త‌గిన‌ట్లే సాగు కూడా ఎక్కువ‌గా ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్ర‌మే ఉల్లిగ‌డ్డ‌ను అధికంగా పండిస్తున్నారు. వాటిలో మహారాష్ట్రదే (Maharashtra) కిరీటం. దేశం మొత్తం ఉల్లి ఉత్పత్తిలో దాదాపు 35 శాతం నుంచి 40 శాతం వాటా ఈ రాష్ట్రానిదే. నాసిక్ జిల్లాలో (Nashik) అత్య‌ధికంగా ఉల్లి దిగుబడి అవుతుంది. అందుకే దీనిని `ఉల్లిగ‌డ్డ‌ల‌ రాజధాని` (Onion Capital of India) అని పిలుస్తారు. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లిగ‌డ్డ‌ల మార్కెట్ లాస‌ల్‌గామ్ మార్కెట్ (Lasalgaon Market) ఈ జిల్లాలోనే ఉంది.

2025 గ‌ణాంకాల ప్ర‌కారం మహారాష్ట్రలో సుమారు 9.7 ల‌క్ష‌ల‌ హెక్టార్లలో ఉల్లి పంట‌ సాగు అవుతున్న‌ది. రాష్ట్రంలోని నాసిక్‌, అహ్మ‌ద్‌న‌గ‌ర్‌, పుణె, సోలాపూర్‌, జ‌ల్‌గామ్‌, స‌తారా జిల్లాలు ఉల్లిగ‌డ్డ సాగుకు ప్ర‌ధాన కేంద్రాలుగా ఉన్నాయి. సగటున హెక్టారుకు సుమారు 15 టన్నుల‌ (14,999 కిలోలు) పంట‌ దిగుబడి అవుతున్న‌ది.

ఆనియన్ హబ్

నాసిక్‌ను ‘ఆనియన్ హబ్’గా పిలుస్తారు. ఇక్కడ‌ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. ఇది ఎర్ర ఉల్లిగ‌డ్డ సాగుకు ప్ర‌సిద్ధి. సారవంతమైన నేల, అనుకూలమైన వాతావరణం, నీటి పారుదల వ్యవస్థ ఉండ‌టంతో ఉల్లి సాగుకు రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికితోడు పండిన పంట‌లో 60 నుంచి 70 శాతం రోజుల వ్య‌వ‌ధిలోనే అమ్ముడ‌వుతుండ‌టంతో అన్న‌దాత‌ల‌కు గిట్టుబాటు అవుతున్న‌ది. దేశం న‌లుమూల‌ల నుంచి వ్యాపారులు వ‌చ్చి ఇక్క‌డ ఉల్లిగ‌డ్డ‌ల‌ను కొనుగోలు చేస్తారు. ఇక్క‌డి నుంచి విదేశాల‌కు కూడా ఎగుమ‌తి అవుతుంది. ఎక్కువ‌గా బంగ్లాదేశ్‌, మ‌లేషియా, యూఏఈ, శ్రీలంక‌, నేపాల్‌, ఇండోనేషియా, సింగ‌పూర్‌, ఖ‌తార్ వంటి దేశాల‌కు ఉల్లిగ‌డ్డ‌ను ఎగుమ‌తి చేస్తున్నారు.

ఈ రాష్ట్రాల్లో అధిక దిగుబ‌డి

మ‌హారాష్ట్ర- 8.6 మిలియ‌న్ ట‌న్నులు (35.4 శాతం). 9.7 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో సాగ‌వుతున్న‌ది.
మ‌ధ్య‌ప్ర‌దేశ్- 4.1 మిలియ‌న్ ట‌న్నులు (17.1 శాతం వాటా), 4.2 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో సాగు
గుజ‌రాత్‌- 2.05 మిలియ‌న్ ట‌న్నులు (8.5 శాతం వాటా), 2.1 ల‌క్ష‌ల హెక్టార్లు.
క‌ర్ణాట‌క‌- 1.63 మిలియ‌న్ ట‌న్నులు (6.7 శాతం వాటా), 1.6 ల‌క్ష‌ల హెక్టార్లు.
రాజ‌స్థాన్‌- 1.63 మిలియ‌న్ ట‌న్నులు (6.7 శాతం వాటా), 1.5 ల‌క్ష‌ల హెక్టార్లు.
ఈ ఐదు రాష్ట్రాల్లోనే దేశంలోని మొత్తం దిగుబ‌డిలో 75 శాతం వాటా క‌లిగి ఉన్నాయి. త‌మిళ‌నాడు, బీహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో కూడా ఉల్లి సాగు అధికంగా అవుతున్న‌ది.

కాగా, ప్ర‌పంచంలో ఉల్లిగ‌డ్డ‌ను అత్య‌ధికంగా పండిస్తున్న దేశాల్లో భార‌త్ అగ్ర‌స్థానంలో ఉండ‌గా, చైనా, ఈజిప్ట్‌, అమెరికా, ట‌ర్కీ దేశాలు త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి.

 

 

Advertisement
Advertisement