త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cell Broadcast Alert | నేడు మీ ఫోన్ ఒక్క‌సారిగా పెద్ద శ‌బ్దంతో మోగ‌నుంది.. ఎందుకంటే?

Cell Broadcast Alert | నేడు మీ మొబైల్ ఫోన్ ఒక్క‌సారిగా పెద్ద శబ్దంతో మోగనుంది. ఆ స‌మ‌యంలో స్క్రీన్‌పై జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ (NDMA) నుంచి మెసేజ్ వ‌స్తుంది. దానిని చూసి భ‌య‌ప‌డిపోకండి. అది ఎలాంటి ప్ర‌మాద హెచ్చ‌రిక కాదు.

G

National | Published On May 2, 2026, 6.52 am IST

Cell Broadcast Alert | నేడు మీ ఫోన్ ఒక్క‌సారిగా పెద్ద శ‌బ్దంతో మోగ‌నుంది.. ఎందుకంటే?
Advertisement

Cell Broadcast Alert | త్రినేత్ర‌.న్యూస్‌: నేడు మీ మొబైల్ ఫోన్ ఒక్క‌సారిగా పెద్ద శబ్దంతో మోగనుంది. ఆ స‌మ‌యంలో స్క్రీన్‌పై జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ (NDMA) నుంచి మెసేజ్ వ‌స్తుంది. దానిని చూసి భ‌య‌ప‌డిపోకండి. అది ఎలాంటి ప్ర‌మాద హెచ్చ‌రిక కాదు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఒక ప‌రీక్ష మాత్ర‌మే.

అవును ఎన్‌డీఎంఏ ఆధ్వర్యంలో శ‌నివారం (మే 2న) దేశవ్యాప్తంగా సెల్‌ బ్రాడ్‌కాస్ట్‌ అలర్ట్ (Cell Broadcast Alert) వ్యవస్థ పరీక్షను నిర్వహించనున్నారు. విప‌త్తుల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డ‌మే దీని ప్ర‌ధాన ఉద్దేశం. దీనిద్వారా సుమ‌నామీ, భూకంపాలు, పిడుగుపాట్లు లేదా గ్యాస్ లీకేజీల వంటి అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ల‌క్ష‌లాది మందికి క్ష‌ణాల్లో స‌మాచారాన్ని (Emergency Alert) చేర‌వేస్తారు. దీంతో విప‌త్తు సంభ‌విండానికి ముందే ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లే అవ‌కాశం ఉంటుంది.

ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ పరీక్ష చేపడ‌తారు. అయితే సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దీనికి మినహాయింపునిచ్చారు. పరీక్ష సమయంలో ప్రజలకు తమ మొబైల్‌ ఫోన్లలో అత్యవసర అలర్ట్‌ నోటిఫికేషన్‌ వస్తుంది. గట్టిగా శబ్దం లేదా వైబ్రేషన్‌తో ఇది రావచ్చు. అలర్ట్‌ వ్యవస్థ సమర్థతను పరీక్షించేందుకు పంపించే సందేశం ఇదని.. ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని అధికారులు వివరించారు. అత్యవసర సమయాల్లో కీలక సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడమే దీని ప్రధాన ఉద్దేశమ‌ని చెప్పారు. పూర్తి స్వ‌దేశీ సాంకేతిక ప‌రిజ్ఞానంతో రూపొందించిన సెల్ బ్రాడ్‌కాస్ట్ సిస్ట‌మ్‌ ప‌నితీరును ఈ ప‌రీక్ష ద్వారా నిర్ధారించుకోనున్నారు. .

Advertisement
Advertisement