త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IMD | రాబోయే ఐదు రోజులు గ‌రిష్ఠ స్థాయికి చేర‌నున్న‌ ఉష్ణోగ్ర‌త‌లు..

IMD | ఇప్ప‌టికే ఎండ తీవ్ర‌త‌కు అల్లాడుతున్న ప్ర‌జ‌ల‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) పిడుగులాంటి వార్త చెప్పింది. ఈ వారం ఎండ‌ల తీవ్ర‌త మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ హెచ్చ‌రించింది. రాబోయే 5-7 రోజుల పాటు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరి, తీవ్ర వడగాల్పులు (Heatwaves) వీచే అవకాశం ఉందని తెలిపింది.

D

National | Published On May 19, 2026, 12.23 pm IST

IMD | రాబోయే ఐదు రోజులు గ‌రిష్ఠ స్థాయికి చేర‌నున్న‌ ఉష్ణోగ్ర‌త‌లు..
Advertisement
  • సాధారణం కంటే 5-6°C ఎక్కువ
  • తీవ్ర వడగాల్పులు వీచే అవ‌కాశం
  • ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు 3-4°C వరకు పెరిగే ఛాన్స్‌
  • ఐఎండీ కీల‌క హెచ్చ‌రిక‌లు

IMD | తెలుగు రాష్ట్రాలు స‌హా దేశ‌వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే ఎక్కువ‌గానే న‌మోద‌వుతున్నాయి. దీంతో ఉక్క‌పోత‌కు జ‌నం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కి రావాలంటేనే జంకుతున్నారు. ఇప్ప‌టికే ఎండ తీవ్ర‌త‌కు అల్లాడుతున్న ప్ర‌జ‌ల‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) పిడుగులాంటి వార్త చెప్పింది.

ఈ వారం ఎండ‌ల తీవ్ర‌త మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ హెచ్చ‌రించింది. రాబోయే 5-7 రోజుల పాటు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరి, తీవ్ర వడగాల్పులు (Heatwaves) వీచే అవకాశం ఉందని తెలిపింది. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు 3-4°C వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు 46°Cకి చేరే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

సాధారణం కంటే 5-6°C ఎక్కువ..

దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40-45°C మధ్య నమోదవుతున్నాయి. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బందాలో అత్యధికంగా 46.4°C ఉష్ణోగ్రత నమోదైంది. పలు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5-6°C ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనివల్ల తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్రమైన వేడిగాలుల వ‌ల్ల ఎండ దెబ్బ త‌గిలే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించింది. అంతేకాదు ఇప్ప‌టికే ఉన్న ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయ‌ని హెచ్చ‌రించింది. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

తెలుగు రాష్ట్రాల‌కు ఐఎండీ అల‌ర్ట్‌..

మే 24 వరకూ జమ్మూ, లడఖ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లతో పాటు ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది.

రాజస్థాన్, విదర్భ వంటి ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు 29-30°C వరకు నమోదవుతున్నాయి. దీంతో వేడి ప్రభావం మరింత పెరుగుతోంది. మే 24 వరకు వాయవ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3°C, అలాగే మే 21 వరకు ఛత్తీస్‌గఢ్‌లో 3-4°C పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు..

ఎండ‌ల తీవ్ర‌త పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు వాతావ‌ణ శాఖ నిపుణులు కీల‌క సూచ‌న‌లు చేశారు. శ‌రీరంలో నీటి శాతం త‌గ్గ‌కుండా చూసుకోవాల‌ని సూచించారు. దాహం వేయ‌క‌పోయినా నీళ్లు తాగుతూ ఉండాల‌ని, ఎక్కువ సేపు ఎండ‌లో ఉండ‌కూడ‌ద‌ని, ఎండ‌లో బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. గొడుగు ప‌ట్టుకోవ‌డం లేదంటే త‌ల‌ను స్కార్ఫ్‌తో క‌వ‌ర్ చేసుకోవడం వంటి చిన్న‌చిన్ని చిట్కాలు పాటించాల‌ని తెలిపారు. అంతేకాదు, స‌మ్మ‌ర్‌లో తేలిక‌పాటి, కాట‌న్ దుస్తులు ధ‌రించ‌డం మంచిద‌ని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో పిల్ల‌లు, వృద్ధులు, గ‌ర్భిణిలు,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఎల్ నివో భ‌యాలు..

ఓవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు 'ఎల్ నినో' (El Nino) గురించిన ఆందోళనలు కూడా వ్య‌క్తమవుతున్నాయి. మే 26న నైరుతి రుతుపవనాలు కేరళను తాకవచ్చని ఐఎండీ ఇప్ప‌టికే అంచ‌నా వేసిన విష‌యం తెలిసిందే. రుతుపవనాలు.. ఇప్పటికే మే 16న అండమాన్ నికోబార్ దీవులను చేరుకున్నాయి. అయితే, జులైలో ఏర్ప‌డే ఎల్ నివో ప్ర‌భావం వ‌ల్ల ఈ ఏడాది వ‌ర్ష‌పాతం త‌క్కువ‌గానే న‌మోద‌య్యే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది.

Also Read..

వీధి కుక్కల తరలింపు ఆదేశాల ఉపసంహరణకు సుప్రీం కోర్టు నిరాకరణ

భార‌త ఆర్మీకి మ‌రింత బూస్ట్‌.. రూ.3,600 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం

రోజుకు ఐదు ఎన్‌కౌంటర్లు.. తొమ్మిదేండ్ల‌లో 17 వేల‌కు పైనే..

Advertisement
Advertisement