IMD | అండమాన్‌కు నైరుతి ఆగయా..! 26న కేరళం తీరాన్ని తాకే ఛాన్స్..
IMD | నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఈ ఏడాది ముందుగానే పలకరించాయి. దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. ఈ నెల 26న కేరళం తీరాన్ని తాకే అవకాశాలున్నాయని భారత వాతావరశాఖ వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు సహా అండమాన్ సముద్రం మీద రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ పేర్కొంది.
IMD | నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఈ ఏడాది ముందుగానే పలకరించాయి. దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. ఈ నెల 26న కేరళం తీరాన్ని తాకే అవకాశాలున్నాయని భారత వాతావరశాఖ వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు సహా అండమాన్ సముద్రం మీద రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ పేర్కొంది. అలాగే, ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి–ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లోనూ రుతుపవనాల కదలికలు కనిపిస్తున్నట్లు వివరించింది. సాధారణంగా, కేరళంలో రుతుపవనాలు జూన్ ఒకటి ప్రారంభమవుతాయి. ఈసారి మాత్రం ముందస్తుగానే పలకరించడం విశేషం. గతంలోనూ పలుసార్లు నైరుతి రుతుపవనాలు దేశాన్ని తాకాయి. గతేడాది మే 24న, 2024 సంవత్సరంలో మే 30న, 2022లో 29న రుతుపవనాలు ప్రవేశించాయి. 2023లో మాత్రం కాస్త ఆలస్యంగా జూన్ 8న పలకరించాయి. 2020లో సాధారణ తేదీ అయిన జూన్ 1ననే రుతుపవనాలు ప్రవేశించాయి.
నైరుతే ఆధారం..
దేశవ్యాప్తంగా వర్షపాతం ప్రధానంగా నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే, ఈసారి వాతావరణ పరిస్థితులు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం తిరిగి బలపడే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరించాయి. ఎల్‌నినో ప్రభావంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి, సాధారణంగా వర్షపాతం తగ్గే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అమెరికా జాతీయ సముద్ర–వాతావరణ సంస్థ (NOAA) తాజా అంచనాల ప్రకారం మే నుంచి జూలై మధ్య ఎల్‌నినో ఏర్పడే అవకాశం 82 శాతంగా ఉండగా.. డిసెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకు అది కొనసాగే అవకాశం 96 శాతంగా ఉందది. ఈ పరిస్థితి మరింత బలపడితే “సూపర్ ఎల్‌నినో” స్థాయి ప్రభావం కనిపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగానే వర్షాలు..
వచ్చే కొన్ని వారాల్లోనే పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఈ ఏడాది వర్షాకాల సీజన్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 13న విడుదల చేసిన అంచనాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సగటు వర్షపాతం 92 శాతం మాత్రమే ఉండొచ్చని తెలిపిన ఐఎండీ.. 35శాతం వరకు లోటు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాలు కురవకపోతే దేశ వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 60శాతానికిపైగా రైతులు వర్షాధార వ్యవసాయంపైనే ఆధాపడుతున్నారు. వానలు కురవకపోతే పంటల దిగుబడి తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






