త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MRPL oil refinery | మంగళూరు రిఫైనరీలో భారీ పేలుడు

MRPL oil refinery | కర్ణాటకలోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) చమురు శుద్ధి కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు (Huge explosion) సంభవించింది.

D

National | Published On Sep 30, 2026, 3.04 pm IST

MRPL oil refinery | మంగళూరు రిఫైనరీలో భారీ పేలుడు
Advertisement

MRPL oil refinery | త్రినేత్ర న్యూస్ : కర్ణాటక మంగ‌ళూరు (Mangaluru)లో భారీ అగ్నిప్ర‌మాదం సంభవించింది. జోకట్టె సమీపంలో ఉన్న మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) చమురు శుద్ధి కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు (Huge explosion) సంభవించింది.

రిఫైనరీ మూడో ప్లాంట్‌ యూనిట్ (hydro sulphur treatment unit) పరిసరాల్లో భారీ శ‌బ్దంతో పేలుడు సంభ‌వించిన‌ట్లు స్థానికులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి స‌మీపంలోని ఇళ్లు కంపించాయ‌ని పేర్కొన్నారు. భూకంపం భ‌యంతో ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీసిన‌ట్లు తెలిపారు. పేలుడు ధాటికి భారీగా మంట‌లు చెల‌రేగాయి. ద‌ట్ట‌మైన పొగ ఆ ప్రాంతాన్ని క‌మ్మేసింది. ఈ పేలుడు ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌టనాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు.

Also Read..

హైజాక్ కోడ్‌.. 2 నిమిషాల్లోనే 17,400 అడుగుల దిగువకు పడిపోయిన విమానం..!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఫారం-6 నుంచి అదనపు డిక్లరేషన్ ఉప‌సంహ‌ర‌ణ‌

మ‌రిన్ని మైలురాళ్ల‌ను చేరుకోవాలి.. ఆర్చ‌రీ జ‌ట్టుకు రాష్ట్ర‌ప‌తి అభినంద‌న‌

Advertisement
Advertisement