Droupadi Murmu | మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలి.. ఆర్చరీ జట్టుకు రాష్ట్రపతి అభినందన
Droupadi Murmu | ఆసియా క్రీడల ఆర్చరీలో (Archery Team) గంటల వ్యవధిలో రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. తొలుత మహిళల టీమ్ ఆర్చరీ కాంపౌండ్‌లో తానపర్తి చికిత (Chikitha Taniparthi), ప్రీతికా, జ్యోతి సురేఖతో కూడిన భారత త్రయం పసిడి దక్కించుకుంది.
Droupadi Murmu | త్రినేత్ర న్యూస్: ఆసియా క్రీడల ఆర్చరీలో (Archery Team) గంటల వ్యవధిలో రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. తొలుత మహిళల టీమ్ ఆర్చరీ కాంపౌండ్‌లో తానపర్తి చికిత (Chikitha Taniparthi), ప్రీతికా, జ్యోతి సురేఖతో కూడిన భారత త్రయం పసిడి దక్కించుకుంది. ఫైనల్‌లో చైనా జట్టును 238- 234 తేడాతో మట్టికరిపించింది. అనంతరం కాసేపటికే జరిగిన కాంపౌండ్ ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంగలో చికితా రావు, సాహిల్ రాజేశ్ జాదవ్ కూడిన జట్టు ఆర్చరీ కాంపౌండ్‌లోనూ బంగారు పతకం (Gold Medal) వచ్చింది. ఫైనల్‌లో సౌత్ కొరియాతో మ్యాచ్‌లో స్కోర్లు సమం కావడంతో షూట్‌ఆఫ్ నిర్వహించారు. ఇందులో భారత్ విజయం సాధించింది. రెండు విజయాల్లో తెలంగాణ అమ్మాయి చికితా రావు భాగమవడం విశేషం. ఇరు జట్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu), సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
దేశానికి గర్వకారణం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈ సందర్భంగా రెండు బంగారు పతకాలను అందించిన ఆర్చరీ జట్లను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. `మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన తనిపర్తి చికిత, ప్రితిక ప్రదీప్, జ్యోతి సురేఖకు హృదయపూర్వక అభినందనలు. మీ అసాధారణమైన ఖచ్చితత్వం, సంయమనం, సమన్వయం దేశానికి గర్వకారణంగా నిలిచాయి. ఈ చిరస్మరణీయ విజయం మరిన్ని మైలురాళ్లను చేరుకోవడానికి మీకు స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నాను` అంటూ రాష్ట్రపతి ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు.
Heartiest congratulations to Taniparthi Chikitha, Prithika Pradeep and Jyothi Surekha Vennam on winning the Gold Medal in the Women’s Compound Archery Team event at the Asian Games 2026!
Your exceptional precision, composure and teamwork have made the nation proud. May this…
— President of India (@rashtrapatibhvn) September 30, 2026
Heartiest congratulations to Chikitha Taniparthi and Sahil Rajesh Jadhav on winning the Gold Medal in the Compound Mixed Archery Team event at the Asian Games 2026!
With every arrow finding its mark, you have combined accuracy and consistency to deliver a superb performance. A…
— President of India (@rashtrapatibhvn) September 30, 2026
తెలంగాణ ముద్దుబిడ్డ తానిపర్తి చికిత: సీఎం రేవంత్
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో మహిళల ఆర్చరీ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ తానిపర్తి చికిత, జట్టు సభ్యులు వెన్నం సురేఖ, ప్రితిక ప్రదీప్‌కు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అద్భుత ప్రతిభతో భారత క్రీడా ఖ్యాతిని సగర్వంగా ప్రపంచ వేదికపై ఎగురవేసిన వారి విజయం మరెంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ గౌరవాన్ని, తెలంగాణ (Telangana) కీర్తిని చాటాలని ఆకాంక్షి ఆకాంక్షించారు. అదేవిధంగా వివిధ క్రీడా విభాగాల్లో పతకాలు సాధించి భారతదేశం గౌరవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!
- ●Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్
- ●KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?
- ●KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం
- ●CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజయ్ జాజు
- ●Nitin Gadkari Flying Bus | గాల్లో ఎగిరే బస్సు.. నితిన్ గడ్కరీ సరికొత్త ప్లాన్!

Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!

Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్

KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?

KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం



