Mamata Banerjee | మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మేనకోడలు బ్రిష్టీ ముఖర్జీ (28) బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం తన నివాసంలో ఉరేసుకొని శవమై కనిపించారు.
Mamata Banerjee | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దీదీ మేనకోడలు బ్రిష్టీ ముఖర్జీ ఘటక్ (Bristi Mukherjee Ghatak) బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆమె వయసు 28 ఏళ్లు. బీర్భూమ్ (Birbhum) జిల్లాలో రాంపూర్‌హాట్‌లోని తన నివాసంలో మంగళవారం మధ్యాహ్నం శవమై కనిపించారు.
బ్రిష్టీ బోల్‌పుర్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో నాన్ టీచింగ్ సిబ్బందిగా పనిచేశారు. అయితే ఈ ఉద్యోగ నియామకాల్లో భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. టీచర్ రిక్రూట్మెంట్‌లో అక్రమాలు జరిగినట్లు రుజువు కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో సుమారు 26 వేల మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. ప్రభుత్వ నిర్ణయంతో బ్రిష్టీ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఓవైపు ఉద్యోగం కోల్పోవడం, మరోవైపు భర్తతో విడాకులు వంటి సమస్యలతో బ్రిష్టీ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. దీనికి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
టీచర్ రిక్రూట్మెంట్‌లో అక్రమాలు
ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సీ, గ్రూప్ డీ స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో అప్పటి దీదీ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. అయితే, 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షకు (Teacher Recruitment Scam) దాదాపు 23 లక్షల మందికిపైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు సైతం అందజేశారు. ఖాళీల ఉన్న సంఖ్య కంటే ఎక్కువ మందిని నియమించడంపై వివాదం చెలరేగింది.
ఉద్దేశపూర్వకంగానే అదనపు పోస్టులను సృష్టించి అక్రమంగా నియామకాలు చేపట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు.. 2016 నాటి ఆ నియామక ప్రక్రియ చెల్లదంటూ 2024 ఏప్రిల్ 22న తీర్పును వెలువరించింది. ఈ కేసులో అధికారుల పాత్ర, అవకతవకలపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దీనిపై బెంగాల్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పలేదు. 25,753 మంది టీచర్ల నియామకాలు చెల్లవని గతేడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పుతో ఆ నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో వేలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. అందులో బ్రిష్టీ కూడా ఒకరు.
Also Read..
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మోసం.. కరెన్సీ చెస్ట్‌లో రూ.7.40 కోట్ల నకిలీ నోట్లు
లైట్స్.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్యవస్థపై ప్రచారం.. ప్రధాని మోదీపై ఖర్గే సెటైర్లు..!
70 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.. పాక్ క్రికెట్ పతనంపై డానిష్ కనేరియా కామెంట్స్..!
సంబంధిత వార్తలు

Mamata Banerjee | కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు
ఆగస్టు 29, 2026

Asish Banerjee Death | తప్పుడు ఆరోపణలతోనే బలితీసుకున్నారు: ఆశిష్ బెనర్జీ మృతిపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఆగస్టు 16, 2026

TMC Rebel MPs | స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకే: 20 మంది రెబల్ ఎంపీలపై టీఎంసీ గురి
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్



