త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asish Banerjee Death | తప్పుడు ఆరోపణలతోనే బలితీసుకున్నారు: ఆశిష్ బెనర్జీ మృతిపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్ బెనర్జీ ఆత్మహత్యపై బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై తప్పుడు ప్రచారం చేసి బలి తీసుకున్నారని ఫైర్ అయ్యారు.

J

National | Published On Aug 16, 2026, 5.47 pm IST

Asish Banerjee Death | తప్పుడు ఆరోపణలతోనే బలితీసుకున్నారు: ఆశిష్ బెనర్జీ మృతిపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
Advertisement
  • రాంపూర్‌హాట్ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ బెనర్జీ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి
  • జీవితకాలం ప్రజాసేవ చేసిన నేతను కావాలనే రాజకీయంగా వేధించారని ఆవేదన
  • తప్పుడు అవినీతి ఆరోపణలతో ఆయనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని మండిపాటు
  • బీజేపీ, కొన్ని మీడియా సంస్థలే ఈ దుష్ప్రచారానికి (Smear campaigns) కారణమని టీఎంసీ నేతల ఆరోపణ

Asish Banerjee Death | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో తీవ్ర విషాదం నింపిన టీఎంసీ (TMC) సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ మృతిపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాంపూర్‌హాట్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆదివారం నాడు బీర్భూమ్ జిల్లాలోని పార్టీ ఆఫీసులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ ఆమె పరోక్షంగా అధికార బీజేపీపై (BJP) విరుచుకుపడ్డారు.

వేధింపులు, తప్పుడు ఆరోపణలే కారణం

జీవితకాలం ఉపాధ్యాయుడిగా, నిజాయితీగల ప్రజా సేవకుడిగా బతికిన ఆశిష్ లాంటి నేతను కావాలనే కొందరు టార్గెట్ చేశారని మమత ఆరోపించారు. గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలతో ఎంతో మమేకమై ఉండే ఆయనపై గత కొద్ది రోజులుగా తప్పుడు అవినీతి ఆరోపణలు (corruption charges) చేసి, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"తన చివరి రోజుల్లో ఆయన ఎంతలా మానసిక క్షోభ (mental strain), భావోద్వేగపరమైన ఒత్తిడి అనుభవించారో తలచుకుంటేనే ఈ విషాదం నన్ను మరింత బాధిస్తోంది" అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.

అభివృద్ధి చేసినా దుష్ప్రచారమే

రాంపూర్‌హాట్ (Rampurhat) అభివృద్ధి కోసం ఆశిష్ బెనర్జీ ఎంతో కష్టపడ్డారని మమత గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా, మాజీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయన చేసిన సేవలను కొనియాడారు. "ప్రజల కోసం ఆయన ఎన్నో ముఖ్యమైన పనులు చేసినప్పటికీ.. నిరంతరం ఆయనపై దుష్ప్రచారం చేశారు. రాజకీయ కక్ష సాధింపులు ఏ స్థాయిలో ఓ మనిషి ప్రాణాలను బలితీసుకుంటాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇది మనందరినీ ఆలోచింపజేయాలి" అంటూ అధికార పార్టీ తీరును పరోక్షంగా ఎండగట్టారు.

భగ్గుమన్న టీఎంసీ శ్రేణులు

ఆశిష్ బెనర్జీ మృతి టీఎంసీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ, కొన్ని మీడియా (media) సంస్థలు కలిసి టీఎంసీ నేతలపై దుష్ప్రచారం రన్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆశిష్ బెనర్జీ లాంటి సౌమ్యుడైన నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని.. ఆయన స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిదని టీఎంసీ నేతలు నివాళులర్పించారు.

Advertisement
Advertisement