Mahesh Babu Son | టాక్సిక్ మూవీకి 0.5 రేటింగ్ ఇచ్చిన మహేష్‌బాబు కొడుకు – నెటిజన్ల ట్రోలింగ్
యశ్ టాక్సిక్ మూవీకి మహేష్‌బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని 0.5 రేటింగ్ ఇవ్వడంపై కన్నడ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. గౌతమ్‌కు చెందిన సినిమా రేటింగ్ ప్లాట్‌ఫామ్ లెటర్‌బాక్స్ ప్రొఫైల్ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో వివిధ భాషల్లో తాను చూసిన సినిమాలకు గౌతమ్ రేటింగ్ ఇచ్చాడు. యశ్ టాక్సిక్‌తో పాటు విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలకు గౌతమ్ 0.5 రేటింగ్ ఇచ్చాడు.
Entertainment | Published On Sep 1, 2026, 4.18 pm IST
Mahesh Babu Son | సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేనిని యశ్ ఫ్యాన్స్‌తో పాటు కన్నడ సినీ అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. టాక్సిక్ సినిమాకు అతడు ఇచ్చిన రేటింగ్ చర్చనీయాంశంగా మారింది. తండ్రి మహేష్‌బాబు బాటలోనే గౌతమ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలో గౌతమ్ యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
లెటర్ బాక్స్...
గౌతమ్ స్వతహాగా సినీ అభిమాని. తండ్రి సినిమాలే కాకుండా తెలుగు, తమిళం, కన్నడం, హాలీవుడ్‌తో పాటు అన్ని భాషలకు చెందిన సినిమాలు చూస్తుంటాడు. గౌతమ్‌కు మూవీస్ రేటింగ్ ప్లాట్‌ఫామ్ లెటర్‌బాక్స్‌లో ఓ అకౌంట్ ఉంది. తాను చూసిన సినిమాలకు అందులో రేటింగ్ ఇస్తుంటాడు. అన్ని భాషల్లో కలిపి దాదాపు నాలుగు వందలకుపైగానే సినిమాలకు గౌతమ్ రేటింగ్ ఇచ్చాడు.
యశ్ టాక్సిక్...
ఇటీవల రిలీజైన యశ్ టాక్సిక్ మూవీకి గౌతమ్ కేవలం 0.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. అతడి లెటర్ బాక్స్ అకౌంట్ ప్రొఫైల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టాక్సిక్‌కు 0.5 రేటింగ్ ఇవ్వడంపై కన్నడ అభిమానులు అతడిని ట్రోల్ చేస్తున్నారు. సినిమా నచ్చకపోతే సైలెంట్‌గా ఉండాలి కానీ ఇలా నెగెటివ్ ప్రచారం చేయద్దని అంటున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా యశ్ ఈ స్థాయికి చేరుకున్నాడని, మహేష్‌బాబులా వారసత్వంతో సినిమాల్లోకి అడుగుపెట్టలేదంటూ కామెంట్లు పెడుతోన్నారు.
టాలీవుడ్ ఫ్యాన్స్ సపోర్ట్...
మరోవైపు టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం గౌతమ్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. సినిమా విషయంలో తన అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్లుగా గౌతమ్ చెప్పాడని, అందులో అతడి తప్పేం లేదని, ట్రోల్ చేయడం సరికాదంటూ కామెంట్లు పెడుతున్నారు. తండ్రి మహేష్‌బాబు సినిమాలు కూడా నచ్చకపోతే గౌతమ్ తక్కువే రేటింగ్ ఇచ్చాడని అంటున్నారు.
పోకిరికి ఐదు రేటింగ్...
తండ్రి నటించిన పోకిరి, వన్ నేనొక్కడినే సినిమాలకు గౌతమ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. నిజం, వంశీ సినిమాలు రెండు, బ్రహ్మోత్సవం సినిమాకు వన్ రేటింగ్ ఇచ్చాడు. ప్రభాస్ బాహుబలి 2కి 5 స్టార్స్ ఇచ్చిన గౌతమ్ కల్కి సినిమాకు మాత్రం 2.5 రేటింగ్ మూవీగా పేర్కొన్నాడ,, విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాకు 4.5 స్టార్స్ ఇవ్వగా...లైగర్ సినిమాకు మాత్రం 0.5 రేటింగ్ మాత్రేమే ఇచ్చాడు. కాగా తన లైటర్‌బాక్స్ రేటింగ్‌లపై విమర్శలు రావడంతో గౌతమ్ అకౌంట్‌ను హైడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ప్రొఫెల్ కనిపించడం లేదు.
గర్వంగా ఉంది...
సోమవారం గౌతమ్ తన 20వ బర్త్‌డే జరుపుకున్నాడు. పుట్టినరోజు సందర్భంగా తనయుడికి మహేష్ స్పెషల్‌గా విషెస్ చెప్పాడు. నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ – రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్
సెప్టెంబర్ 3, 2026

Ntr | నాన్‌స్టాప్‌గా షూటింగ్ – చెప్పిన డేట్‌కే థియేటర్లలోకి ఎన్టీఆర్ డ్రాగన్
సెప్టెంబర్ 3, 2026

Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ – నాలుగోసారి కాంబో రిపీట్
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్



