Pak Cricket | 70 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.. పాక్ క్రికెట్ పతనంపై డానిష్ కనేరియా కామెంట్స్..!
Pak Cricket | వరుస పరాజయాలతో పాకిస్థాన్ క్రికెట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ జట్టు ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను కోల్పోయి 0-2తో వెనుకపడింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు డానిష్ కనేరియా జట్టు ప్రదర్శన, ఎంపిక, కోచింగ్, క్రికెట్ బోర్డు తీరుపై తీవ్రంగా స్పందించాడు.
Pak Cricket | వరుస పరాజయాలతో పాకిస్థాన్ క్రికెట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ జట్టు ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను కోల్పోయి 0-2తో వెనుకపడింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు డానిష్ కనేరియా జట్టు ప్రదర్శన, ఎంపిక, కోచింగ్, క్రికెట్ బోర్డు తీరుపై తీవ్రంగా స్పందించాడు. పాక్ క్రికెట్ గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత దారుణ పరిస్థితిలో ఉందని కనేరియా వ్యాఖ్యానించాడు. ఓడిపోవడం పెద్ద విషయం కాదని.. కనీసం పోరాట పటిమ కూడా కనిపించకపోవడమే బాధాకరమన్నాడు. ఆటగాళ్లు, సెలెక్టర్లు ఎవరూ వైఫల్యానికి బాధ్యత తీసుకోవడం లేదని, జట్టుకు స్పష్టమైన వ్యూహం కనిపించడం లేదని విమర్శించాడు. బాబర్‌ను కెప్టెన్‌గా తొలగించి మళ్లీ నియమించడం, సర్ఫరాజ్ అహ్మద్‌ను టెస్టు కోచ్‌గా తీసుకొచ్చి ఇప్పుడు తప్పించడం వంటి నిర్ణయాలను ప్రశ్నించాడు.
బౌలింగ్‌పై తీవ్ర విమర్శలు
ఇంగ్లాండ్ పరిస్థితులకు తగ్గ బౌలింగ్ దళం పాక్‌కు లేదని కనేరియా పేర్కొన్నాడు. 140-150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసే పేసర్లు అవసరమైన చోట 120 కి.మీ. వేగంతో బంతులు వేసే బౌలర్లు మాత్రమే ఉన్నారని అన్నాడు. మంచి స్పిన్నర్లు కూడా లేరని, టెస్టులు బౌలర్లే గెలిపిస్తారని గుర్తుచేశాడు. మహ్మద్ అబ్బాస్, సాజిద్ ఖాన్ వంటి వారు రాణించినా జట్టులోకి తీసుకుని మళ్లీ పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదన్నాడు. బ్యాటింగ్‌పైనా కనేరియా అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ తమ బ్యాటింగ్‌లో స్థాయిని చూపడం లేదని విమర్శించాడు. మూడో టెస్టు కోసం ఏకంగా ఏడు మార్పులు చేయనున్నట్లు వార్తలు రావడాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఆటగాళ్లను ముందే ఎందుకు ఎంపిక చేయలేదని సెలెక్టర్లను ప్రశ్నించాడు.
పరిపాలనపైనా..
పాకిస్థాన్ జట్టు ప్రపంచవ్యాప్తంగా నవ్వులపాలవుతోందని కనేరియా ఆవేదన వ్యక్తం చేశాడు. అభిమానులు మ్యాచ్‌లు చూడటం మానేస్తే బ్రాడ్‌కాస్టర్స్ సైతం ఆసక్తి చూపరని హెచ్చరించాడు. బంధుప్రీతి కాకుండా ప్రతిభకు అవకాశమిచ్చే ఆటగాళ్లు, కోచ్‌లు, సెలెక్టర్లను ఎంపిక చేయాలని సూచించాడు. విదేశీ కోచ్‌ల విషయంలో స్థానికుల జోక్యం తగ్గించాలని చెప్పాడు. దేశవాళీ క్రికెట్ నిర్మాణంలో మార్పులు పాక్ క్రికెట్ పతనానికి కారణమని కనేరియా అభిప్రాయపడ్డాడు. గతంలో క్వాయిడ్-ఎ-ఆజమ్ ట్రోఫీతో పాటు డిపార్ట్‌మెంటల్ క్రికెట్ ఉండేదని, దాన్ని తొలగించడంతో నాణ్యమైన ఆటగాళ్లు వెలుగులోకి రావడం తగ్గిందన్నాడు.
శ్రీలంక క్రికెటర్‌పై ప్రశంసలు..
ఇదే సమయంలో శ్రీలంక యువ బ్యాటర్ సోనాల్ దినూషను కనేరియా ప్రశంసించాడు. శ్రీలంక కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ప్రతిభను వెలికి తీయడంలో సమర్థుడని, రాబోయే ఏడు-ఎనిమిది నెలల్లో శ్రీలంక ప్రమాదకర జట్టుగా మారొచ్చని పేర్కొన్నాడు. కిర్‌స్టెన్ గతంలో పాకిస్థాన్‌కు కూడా కోచ్‌గా పనిచేశాడని గుర్తుచేస్తూ.. మంచి వ్యక్తులు పాక్ క్రికెట్‌లో ఎక్కువకాలం కొనసాగలేకపోతున్నారని వ్యాఖ్యానించాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●1980s AI Trend | సోషల్ మీడియాలో '80s ట్రెండ్'.. రేవంత్, రాహుల్, మోదీల లుక్ చూశారా?
- ●Gig Workers | గిగ్ వర్కర్ల కోసం హైదరాబాద్‌లో ‘ప్రగతి’ కేంద్రాలు
- ●Candeur Lakescape Kondapur | ప్రాణాల మీదకు తెస్తున్న 47 అంతస్తుల నిర్మాణం.. కారుపై పడిన భారీ రాయి, తృటిలో తప్పించుకున్న విద్యార్థి
- ●National Conference | ఆర్టీఐపై హైదరాబాద్ వేదికగా జాతీయ సదస్సు
- ●Bandi Sanjay | సీఎం కుర్చీకే ఎసరు.. కేసీ వేణుగోపాల్‌కు డైరెక్ట్‌గా డబ్బులు
- ●CM Revanth Reddy | కేసీఆర్ ఎర్రవెల్లి మీటింగ్‌పై విచారణ!

1980s AI Trend | సోషల్ మీడియాలో '80s ట్రెండ్'.. రేవంత్, రాహుల్, మోదీల లుక్ చూశారా?

Gig Workers | గిగ్ వర్కర్ల కోసం హైదరాబాద్‌లో ‘ప్రగతి’ కేంద్రాలు

Candeur Lakescape Kondapur | ప్రాణాల మీదకు తెస్తున్న 47 అంతస్తుల నిర్మాణం.. కారుపై పడిన భారీ రాయి, తృటిలో తప్పించుకున్న విద్యార్థి

National Conference | ఆర్టీఐపై హైదరాబాద్ వేదికగా జాతీయ సదస్సు




