Kapur Family | కపూర్ ఫ్యామిలీ రూ.30,000 కోట్ల ఆస్తి వివాదం.. మహాభారతాన్ని మించిపోయింది : సుప్రీంకోర్టు
Kapur Family | రూ. 30,000 కోట్ల వారసత్వ ఆస్తి కోసం కపూర్ కుటుంబంలో (Kapur Family) జరుగుతున్న పోరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదాన్ని మహాభారతం (Mahabharatam)తో పోల్చింది.
Kapur Family | రూ. 30,000 కోట్ల వారసత్వ ఆస్తి కోసం కపూర్ కుటుంబంలో (Kapur Family) జరుగుతున్న పోరు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారం తాజాగా సుప్రీంకోర్టుకు (Supreme Court) చేరింది. ఈ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదాన్ని మహాభారతం (Mahabharatam)తో పోల్చింది.
గతేడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో పోలో ఆడుతూ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ (Sunjay Kapur) మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత కపూర్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం మొదలైంది. ఇక సంజయ్ కపూర్ తల్లి 80 ఏళ్ల రాణి కపూర్ ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కుటుంబ ఆస్తుల్లో కీలకమైన రఘువంశీ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Raghuvanshi Investments Private Limited) బోర్డు ఈ నెల 18న సమావేశం కాకుండా అడ్డుకోవాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. ఈ సమావేశం కోర్టు ఆదేశించిన 'మధ్యవర్తిత్వ ప్రక్రియను' పక్కదారి పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నంగా పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ జస్టిస్ జె.బి. పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకరిపై ఒకరు వేసుకుంటున్న పిటిషన్ల వెల్లువను చూసి ధర్మాసనం వ్యంగ్యంగా స్పందించింది. "మేము ఒక యుద్ధ క్షేత్రంలోకి ప్రవేశించాం. దీని ముందు మహాభారతం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది" అంటూ జస్టిస్ పార్థీవాలా వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.
కాగా, దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ రూ. 30,000 కోట్ల ఆస్తుల విషయంలో.. ఆయన మూడో భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్, మొదటి భార్య కరిష్మా కపూర్ పిల్లల (సమైరా, కియాన్) మధ్య వివాదం కొనసాగుతోంది. 2025 జూన్‌లో సంజయ్ మరణం తర్వాత బయటకు వచ్చిన వీలునామా నకిలీదని కరిష్మా పిల్లలు ఆరోపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను మధ్యవర్తిగా నియమించింది. ఆయన సమక్షంలో ఇరు వర్గాలు కూర్చొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఆస్తుల విషయంలో కరిష్మా కపూర్ పిల్లలకు ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఊటర కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కపూర్ వీలునామాకు ఈ మధ్యవర్తిత్వం వర్తించదు. ఆర్కే ట్రస్ట్, రాణీకపూర్ ఫ్యామిలీ ట్రస్ట్, సోనా కామ్‌స్టార్, కపూర్ కుటుంబంతో సంబంధం ఉన్న ఇతర కంపెనీలకు సంబంధించి మాత్రమే మధ్యవర్తిత్వం జరుగుతుంది.
Also Read..
సరిహద్దుల్లో ముళ్లకంచెలకు భయపడం.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్
ప్రధాని పొదుపు సూచనల వేళ.. భారీ కాన్వాయ్‌తో వెళ్లిన బీజేపీ నేత
బలపరీక్షకు ముందు టీవీకేకి షాక్.. ఓటింగ్‌లో ఆ ఎమ్మెల్యే పాల్గొనకూడదంటూ ఆదేశం
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






