Bangladesh | సరిహద్దుల్లో ముళ్లకంచెలకు భయపడం.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్
Bangladesh | సరిహద్దు వెంబడి ముళ్లకంచె (barbed-wire fencing) నిర్మాణాన్ని వేగవంతం చేస్తామంటూ పశ్చిమ బెంగాల్ (West Bengal) కొత్త ప్రభుత్వం చేసిన ప్రకటనపై బంగ్లాదేశ్ తాజాగా స్పందించింది. గతంలోలాగా సరిహద్దు సమస్యల విషయంలో బంగ్లాదేశ్ ఇక ఎంతమాత్రం తలవంచబోదని స్పష్టం చేసింది.
International | Published On May 12, 2026, 5.35 pm IST
Bangladesh | గతంలోలాగా సరిహద్దు సమస్యల విషయంలో బంగ్లాదేశ్ (Bangladesh) ఇక ఎంతమాత్రం తలవంచబోదని ఆదేశ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ (Tarique Rahman) విదేశీ వ్యవహారాల సలహాదారు హుమాయూన్ కబీర్ (Humayun Kabir) అన్నారు. సరిహద్దు వెంబడి ముళ్లకంచె (barbed-wire fencing) నిర్మాణాన్ని వేగవంతం చేస్తామంటూ పశ్చిమ బెంగాల్ (West Bengal) కొత్త ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై బంగ్లాదేశ్ తాజాగా స్పందించింది.
"బంగ్లాదేశ్ ప్రజలు, ప్రభుత్వం సరిహద్దుల్లో ముళ్ల తీగలకు భయపడరు. హసీనా హయాంలో ఉన్నట్లుగా సరిహద్దులు ఇకపై ఉండవు. మాకూ సొంత ప్రణాళికలు ఉన్నాయి. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే భారత్‌తో చర్చలు కూడా జరుపుతాం. భారత అంతర్గత రాజకీయాల్లో మేం జోక్యం చేసుకోబోం. కేంద్రంతో సంబంధాలే మాకు ముఖ్యం" అని హుమాయూన్ కబీర్ వ్యాఖ్యానించారు.
పశ్చిమబెంగాల్‌తో బంగ్లాదేశ్‌కు సుమారు 4,097 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అందులో 3,240 కిలోమీటర్ల మేర పూర్తవగా.. 850 కి.మీ మేర పెండింగ్‌లో ఉంది. దీన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు బెంగాల్ నూతన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీఎం సువేందుకు అధికారి (CM Suvendu Adhikari) తన తొలి కేబినెట్‌లోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు వెంబడి ముళ్లకంచె నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని ప్రకటించారు. అందుకు అవసరమైన భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగిస్తామని తెలిపారు. 45 రోజుల్లోనే భూమి బదిలీ పూర్తి చేస్తామని ప్రకటించారు.
Also Read..
ప్రధాని పొదుపు సూచనల వేళ.. భారీ కాన్వాయ్‌తో వెళ్లిన బీజేపీ నేత
బలపరీక్షకు ముందు టీవీకేకి షాక్.. ఓటింగ్‌లో ఆ ఎమ్మెల్యే పాల్గొనకూడదంటూ ఆదేశం
అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణం.. తొలి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి.. ఆర్జీకర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మే 19, 2026

West Bengal Annapurna Scheme | బెంగాల్ సర్కార్ భారీ నజరానా: మహిళలకు నెలకు రూ.3000, ఉచిత బస్సు ప్రయాణం!
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



