Supreme Court | ఎన్‌టీఏను రద్దు చేయండి.. నీట్ పేపర్ లీక్ వేళ సుప్రీంకోర్టులో పిటిషన్
Supreme Court | నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోను యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఉన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
Supreme Court | నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోను యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఉన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1860 కింద పనిచేస్తున్న ప్రస్తుత ఎన్‌టీఏను రద్దు చేసి.. దాని స్థానంలో పార్లమెంట్ చట్టం ద్వారా కొత్తగా సంస్థను ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు. ఈ కొత్త సంస్థకు స్పష్టమైన చట్టబద్ధ అధికారాలు, పారదర్శకత, పార్లమెంట్‌కు బాధ్యత వహించేలా విధానం ఉండాలని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలైన ఈ పిటిషన్‌లో నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో వ్యవస్థాగత వైఫల్యం చోటు చేసుకుందని ఆరోపించారు. పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించేలా విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పుణేకు చెందిన ప్రొఫెసర్ పీవీ కులకర్ణిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. లాతూర్‌కు చెందిన కులకర్ణి గత కొన్నేళ్లుగా నీట్ ప్రశ్నాపత్రాలు తయారు చేసే ప్యానెల్స్ సభ్యుడిగా పని చేసినట్లు సమాచారం. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని దుర్వినియోగం చేశారని, ఏప్రిల్ చివరి వారంలో తన ఇంట్లో ప్రత్యేకంగా కోచింగ్ క్లాస్‌లు నిర్వహించి విద్యార్థులకు ప్రశ్నలు, ఆప్షన్లు, సమాధానాలు చెప్పినట్లుగా సీబీఐ ఆరోపిస్తోంది. ఇవే ప్రశ్నలు మే 2న జరిగిన నీట్-యూజీ పరీక్షలో యథాతథంగా వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ కోచింగ్ సెషన్స్‌ను మనీషా వాఘ్మారే అనే మరో నిందితురాలి సహాయంతో నిర్వహించినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది. ఆమెను మే 14న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరగతులకు హాజరైన విద్యార్థులు రూ.లక్షలు చెల్లించి ప్రశ్నలు, సమాధానాలు తీసుకున్నారని, తర్వాత ఒరిజినల్ ఎగ్జామ్ పేపర్‌తో సరిపోలాయని వివరించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు దాడులు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసిన వస్తువులపై ఫోరెన్సిక్, సాంకేతిక విశ్లేషణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






