త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET UG | రూ.10 ల‌క్ష‌లు పెట్టి పేప‌ర్ కొంటే.. వ‌చ్చింది 107 మార్కులే..

NEET UG | నీట్ యూజీ (NEET UG) ప్ర‌శ్న‌ప‌త్రం లీక్ (Paper Leake) కేసులో సీబీఐ ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టికే ముగ్గురు నిందితుల‌ను అరెస్టు చేసింది. వారిలో ఓ నిందితుడి కుమారుని కోసం గాలిస్తున్న‌ది.

G

National | Published On May 17, 2026, 8.34 am IST

NEET UG | రూ.10 ల‌క్ష‌లు పెట్టి పేప‌ర్ కొంటే.. వ‌చ్చింది 107 మార్కులే..
Advertisement

NEET UG | త్రినేత్ర‌.న్యూస్‌: నీట్ యూజీ (NEET UG) ప్ర‌శ్న‌ప‌త్రం లీక్ (Paper Leake) కేసులో సీబీఐ ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టికే ముగ్గురు నిందితుల‌ను అరెస్టు చేసింది. వారిలో ఓ నిందితుడి కుమారుని కోసం గాలిస్తున్న‌ది. ప‌రీక్ష‌కు ముందే గెస్‌ పేప‌ర్‌ను కొనుగోలు చేసిన‌ప్ప‌టికీ అత‌డు క్వాలిఫై కూడా కాలేద‌ని గుర్తించింది.

ఈ నెల 3న దేశ‌వ్యాప్తంగా నీట్ యూజీ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే ఎగ్జామ్ పేప‌ర్ లీక్ అయిన‌ట్లు తేలడంతో ప‌రీక్ష‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ర‌ద్దు చేసింది. జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వ‌హించ‌నున్నట్లు ప్ర‌క‌టించింది. లీకేజీ వ్య‌వ‌హారాన్ని సీబీఐకి అప్ప‌గించింది. ఈ నేప‌థ్యంలో రాజ‌స్థాన్‌లోని సిక‌ర్ జిల్లాలో (Sikar district) సోద‌రులైన దినేష్, మంగీలాల్ బివాల్, అత‌ని పెద్ద కుమారుడు వికాస్‌ను అరెస్టు చేశారు. వారిని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

నిందితుడు దినేశ్ బివాల్ త‌న‌ కుమారుడైన రిషి బివాల్ కోసం రూ.10 ల‌క్ష‌లు వెచ్చించి నీట్ పేప‌ర్ కొనుగోలు చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అయిన‌ప్ప‌టికీ అత‌నికి ప‌రీక్షలో అంతంత మాత్రంగానే మార్కులు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. మొత్తం 720 మార్కుల‌కు గాను 107 మార్కులు మాత్ర‌మే సాధించిన‌ట్లు స‌మాచారం. దీంతో డ‌బ్బులు పెట్టి ఎగ్జామ్ పేప‌ర్‌ను కొనుగోలు చేసిన‌ప్ప‌టికీ అత‌డు క‌నీసం ఉత్తీర్ణ‌త సాధించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కాగా, రిషి కోసం తానే పేపర్‌ను సమకూర్చినట్లు విచార‌ణ‌లో దినేశ్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు సమాచారం అందించాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న‌ రిషి కోసం సీబీఐ అధికారులు గాలిస్తున్నారు.

మొద‌టి నుంచి అత్తెస‌రు మార్కులే..

కాగా, రిషి అక‌డ‌మిక్ రికార్డు పేల‌వంగా ఉన్న‌ట్లు అధికారుల ప‌రిశీల‌న‌లో తేలింది. 10వ త‌ర‌గ‌తిలో 44 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణుడ‌య్యాడు. అదేవిధంగా 12వ త‌ర‌గ‌తిలో 50.80 శాతం మార్కుల‌తో సెకండ్ డివిజ‌న్ సాధించాడు.

Advertisement
Advertisement