త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET UG | అన్నీ సేమ్‌.. గెస్ పేప‌ర్‌లో అడిగిన కెమిస్ట్రీ ప్ర‌శ్న‌లే నీట్ యూజీలో కూడా!

NEET UG | నీట్ యూజీ (NEET UG) పేప‌ర్ లీక్ (Paper Leak) వ్య‌వ‌హారంలో విస్తు పోయే విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. గేస్ పేప‌ర్‌లోని (Guess Paper) కెమిస్ట్రీ ప్ర‌శ్న‌లు (Chemistry Questions) ప‌రీక్ష నిర్వ‌హించిన నీట్ పేప‌ర్‌తో (NEET Exam) నూరుకు 100 శాతం స‌రిపోలాయి.

G

National | Published On May 20, 2026, 7.20 am IST

NEET UG | అన్నీ సేమ్‌.. గెస్ పేప‌ర్‌లో అడిగిన కెమిస్ట్రీ ప్ర‌శ్న‌లే నీట్ యూజీలో కూడా!
Advertisement

NEET UG | త్రినేత్ర‌.న్యూస్‌: నీట్ యూజీ (NEET UG) పేప‌ర్ లీక్ (Paper Leak) వ్య‌వ‌హారంలో విస్తు పోయే విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. గేస్ పేప‌ర్‌లోని (guess paper) కెమిస్ట్రీ ప్ర‌శ్న‌లు (Chemistry Questions) ప‌రీక్ష నిర్వ‌హించిన నీట్ పేప‌ర్‌తో (NEET Exam) నూరుకు 100 శాతం స‌రిపోలాయి. దీంతో లీక్‌కు మూలాల‌ను గుర్తించ‌డానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అంతర్గతంగా విచారణ జ‌రుపుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో కెమిస్ట్రీ పేపర్ రూపొందించిన‌వారు, అనువాదకుల పేర్ల జాబితాను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అందించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

మే 3న దేశ‌వ్యాప్తంగా నీట్ ప‌రీక్ష నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. నాలుగు రోజుల త‌ర్వాత అంటే ఈ నెల 7న రాజ‌స్థాన్‌లోని సికార్‌కు చెందిన ఓ వ్య‌క్తి పేప‌ర్ లీక్ అయిందంటూ ఎన్‌టీఏకి మెయిల్ చేశారు. ఆ త‌ర్వాత లీక్ అయిన పేప‌ర్ పీడీఎఫ్‌ను కూడా పంపించారు. దానిని అసలు పేపర్‌తో పోల్చిచూడ‌టంతో.. కెమిస్ట్రీ ప్రశ్నలు 100 శాతం లీక్ అయ్యాయని, బయాలజీ పేపర్ ప్రశ్నలు కూడా పాక్షికంగా లీక్ అయిన‌ట్లు గుర్తించింది.

వారే కార‌ణం..!

దీంతో కెమిస్ట్రీ పేప‌ర్‌ను రూపొందించిన ప్రొఫెస‌ర్లు, అనువాదకులు మొత్తం 27 మంది పేర్ల‌తో కూడిన జాబితాను సీబీఐకి ఇచ్చింది. పేప‌ర్ లీకేజీకి వారే కార‌ణ‌మ‌ని తెలిపిన‌ట్లు పేరు వెళ్ల‌డించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఓ అధికారి తెలిపారు. వారిలో 24 మంది ట్రాన్స్‌లేట‌ర్లు కాగా, మిగిలిన వారు పేపర్‌ను త‌యారుచేసేవారు. ఫిజికల్, ఇన్ఆర్గానిక్‌, ఆర్గానిక్ కెమిస్ట్రీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో కొందరు గతంలో కూడా అనువాదకులుగా, పేపర్ సెట్టర్లుగా పనిచేసి ఉండొచ్చని వెల్ల‌డించారు.

ప్ర‌తి భాష‌కు ఇద్ద‌రు అనువాద‌కులు..

నీట్ ప‌రీక్ష‌ను దేశంలో గుర్తింపు పొందిన 12 భాష‌ల్లో నిర్వ‌హిస్తారు. ఈ నేప‌థ్యంలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ సబ్జెక్టుల‌కు ప్ర‌త్యేక ట్రాన్స్‌లేట‌ర్ల‌ను ఎన్‌టీఏ నియ‌మిస్తుంది. అనువాదంలో ఏమాత్రం అర్థం మార‌కుండా ఉండేలా చూడ‌టానికి ప్రతి సబ్జెక్టుకు, ప్రతి భాషకు ఇద్దరు అనువాదకులు ఉంటారు. ఒకరు సబ్జెక్టు పేపర్‌ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించడానికి, మరొకరు తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదిస్తారు.

 

Advertisement
Advertisement