Revanth Reddy | పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. సామాన్యుల పాలిట పిడుగుపాటు: సీఎం రేవంత్
Revanth Reddy | పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Diesel Prices) పెంపు ఏమాత్రం సమర్ధనీయం కాదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని విమర్శించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Diesel Prices) పెంపు ఏమాత్రం సమర్ధనీయం కాదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని విమర్శించారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందన్నారు. ప్రధాని మోదీ (PM Modi) అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని చెప్పారు. ఆత్మ నిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు అన్నది తేలిపోయిందని వెల్లడించారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించిందని చెప్పారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలిందని విమర్శించారు. గత పదేండ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తున్నదని, ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరిందన్నారు.
సామాన్యుల నడ్డి విరచడమే..
ఈ పరిస్థితుల్లో ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనని చెప్పారు. ప్రపంచంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుంటున్న మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు.
ప్రజల నమ్మకాన్ని వంచించడమే..
ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం “పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచం” అని పదే పదే ప్రకటించింది. ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే రూ.3 కు పైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమే. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెబుతారని ప్రజలు భావిస్తున్నారు. ఇది విశ్వాస ఘాతుకం అవుతుంది.` అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sowcar Janaki | దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత - రెండు వందల తెలుగు సినిమాల్లో హీరోయిన్గా!
- ●Senior Citizen Savings Scheme | పోస్టాఫీస్ పథకం.. నెలకు రూ.20వేల ఆదాయం ఇలా..
- ●Nayanthara | నయనతార సినిమాలో విలన్‌గా కోలీవుడ్ హీరోయిన్ - రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్
- ●ASUS VM240 AiO | ఏఐ ఫీచర్లతో వచ్చిన అసుస్ కొత్త ఆలిన్ వన్ పీసీ.. ఏ పనికైనా సపోర్ట్..
- ●సీఎం రేవంత్ యూఎస్ పర్యటన బ్రేక్.. తెరపైకి 'ఐఓసీ' ఈవెంట్ వివాదం!
- ●Vedma Bojju| పిల్ల కాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు కావవి.. కొండా సురేఖ మాటలే

Sowcar Janaki | దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత - రెండు వందల తెలుగు సినిమాల్లో హీరోయిన్గా!

Senior Citizen Savings Scheme | పోస్టాఫీస్ పథకం.. నెలకు రూ.20వేల ఆదాయం ఇలా..

Nayanthara | నయనతార సినిమాలో విలన్‌గా కోలీవుడ్ హీరోయిన్ - రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్

ASUS VM240 AiO | ఏఐ ఫీచర్లతో వచ్చిన అసుస్ కొత్త ఆలిన్ వన్ పీసీ.. ఏ పనికైనా సపోర్ట్..






