SEBI | విదేశీ ఇన్వెస్టర్లకు సెబీ గుడ్‌న్యూస్.. పాన్ అప్లికేషన్ నిబంధనలు సడలింపు..
SEBI | సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) కోసం ఆన్‌బోర్డింగ్ నిబంధనలను సడలించింది. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్-2026 అమలులో భాగంగా పాన్ కార్డు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
SEBI | సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) కోసం ఆన్‌బోర్డింగ్ నిబంధనలను సడలించింది. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్-2026 అమలులో భాగంగా పాన్ కార్డు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. మార్చిలో నోటిఫై చేసిన కొత్త పాన్ అప్లికేషన్ విధానంపై మార్కెట్ వర్గాలు ఆందోళనలు వ్యక్తం చేయడంతో, ఈ సమస్యలను పరిష్కరించేందుకు సెబీ నేరుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT)తో చర్చలు జరిపింది. అనంతరం సీబీడీటీ పాన్ జారీ ప్రక్రియను సులభతరం చేసేలా పలు సడలింపులు ప్రకటించింది. కొత్త పాన్ అప్లికేషన్ ఫ్రేమ్‌వర్క్‌లో ట్యాక్స్‌పేయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (టీఐఎన్), అధీకృత ప్రతినిధుల వివరాలు, సంబంధిత డాక్యుమెంట్లు తప్పనిసరి చేయడంతోపాటు, మొబైల్ నంబర్ వంటి కొన్ని ఫీల్డ్స్‌ను కూడా మాండేటరీ చేశారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లకు ప్రాసెస్ క్లిష్టంగా మారింది.
ఆథరైజ్డ్ సిగ్నేటరీ లేకపోతే..
తాజాగా ప్రకటించిన సడలింపుల ప్రకారం కామన్ అప్లికేషన్ ఫారమ్ (సీఏఎఫ్)లో పేర్కొన్న ఆథరైజ్డ్ సిగ్నేటరీనే పాన్ కోసం ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్‌గా పరిగణిస్తారు. దీనికి అదనపు సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం ఉండదు. ఈ విషయంలో ఆథరైజ్డ్ సిగ్నేటరీ బాధ్యత కేవలం పాన్ అప్లికేషన్ వరకే పరిమితమని సెబీ స్పష్టం చేసింది. అలాగే ఆథరైజ్డ్ సిగ్నేటరీ కాంటాక్ట్ డీటైల్స్ అందుబాటులో లేని పరిస్థితుల్లో, ఎఫ్‌పీఐలు తమ సొంత అడ్రస్, ఈ-మెయిల్, ఫోన్ వివరాలను సమర్పించవచ్చని తెలిపింది. మరో కీలక మార్పులో భాగంగా, ఆథరైజ్డ్ సిగ్నేటరీకి సంబంధించిన పాన్, ఆధార్ లేదా పాస్‌పోర్ట్ వివరాలు అందుబాటులో లేకపోతే, ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సమర్పించడానికి అనుమతి ఇచ్చారు. అలాగే టీఐఎన్ లేదా సమాన గుర్తింపు నంబర్లు జారీ చేయని దేశాల నుంచి వచ్చిన ఎఫ్‌పీఐలు సంబంధిత ఫీల్డ్‌లో 0000000000 అనే ప్లేస్‌హోల్డర్ విలువను ఉపయోగించుకోవచ్చని సీబీడీటీ తెలిపింది.
మొబైల్ నంబర్ లేకపోతే..
మొబైల్ నంబర్ అందుబాటులో లేకపోతే, ప్రత్యామ్నాయంగా ల్యాండ్‌లైన్ నంబర్‌ను ఇవ్వవచ్చని కూడా సెబీ వెల్లడించింది. ఎఫ్‌పీఐల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడమే ఈ చర్యల ఉద్దేశమని సెబీ పేర్కొంది. ప్రస్తుతం ఎఫ్‌పీఐలు సెబీ రిజిస్ట్రేషన్, బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్, పాన్ పొందడం కోసం ఒకే కామన్ అప్లికేషన్ ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sowcar Janaki | దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత - రెండు వందల తెలుగు సినిమాల్లో హీరోయిన్గా!
- ●Senior Citizen Savings Scheme | పోస్టాఫీస్ పథకం.. నెలకు రూ.20వేల ఆదాయం ఇలా..
- ●Nayanthara | నయనతార సినిమాలో విలన్‌గా కోలీవుడ్ హీరోయిన్ - రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్
- ●ASUS VM240 AiO | ఏఐ ఫీచర్లతో వచ్చిన అసుస్ కొత్త ఆలిన్ వన్ పీసీ.. ఏ పనికైనా సపోర్ట్..
- ●సీఎం రేవంత్ యూఎస్ పర్యటన బ్రేక్.. తెరపైకి 'ఐఓసీ' ఈవెంట్ వివాదం!
- ●Vedma Bojju| పిల్ల కాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు కావవి.. కొండా సురేఖ మాటలే

Sowcar Janaki | దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత - రెండు వందల తెలుగు సినిమాల్లో హీరోయిన్గా!

Senior Citizen Savings Scheme | పోస్టాఫీస్ పథకం.. నెలకు రూ.20వేల ఆదాయం ఇలా..

Nayanthara | నయనతార సినిమాలో విలన్‌గా కోలీవుడ్ హీరోయిన్ - రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్

ASUS VM240 AiO | ఏఐ ఫీచర్లతో వచ్చిన అసుస్ కొత్త ఆలిన్ వన్ పీసీ.. ఏ పనికైనా సపోర్ట్..






