త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP High Court | పొగాకు మానేయమంటే..పుట్టింటికి పోయింది.. కాపురం వద్దన్నది

MP High Court | భార్యతో కాపురం కోసం దాంపత్య హక్కుల (Conjugal Rights) పునరుద్ధరణ కోరుతూ భ‌ర్త కోర్టును ఆశ్ర‌యించినంత‌ మాత్రాన భార్య త‌న‌పై పెట్టిన క్రూర‌త్వ‌, క‌ట్నం వేధింపుల ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయ‌లేమ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు (MP High Court) స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఓ భ‌ర్త దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది.

D

National | Published On Oct 22, 2026, 6.07 pm IST

MP High Court | పొగాకు మానేయమంటే..పుట్టింటికి పోయింది.. కాపురం వద్దన్నది
Advertisement

MP High Court | త్రినేత్ర న్యూస్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఓ భ‌ర్త దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను జస్టిస్ ప్రమోద్ కుమార్ అగర్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసింది. భార్యతో కాపురం కోసం దాంపత్య హక్కుల (Conjugal Rights) పునరుద్ధరణ కోరుతూ కోర్టును ఆశ్ర‌యించినంత‌ మాత్రాన భార్య త‌న‌పై పెట్టిన క్రూర‌త్వ‌, క‌ట్నం వేధింపుల ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇవీ కేసు వివ‌రాలు..

దంప‌తుల‌కు 2020 డిసెంబ‌ర్‌లో వివాహం జ‌రిగింది. వీరికి ఒక సంతానం కూడా ఉంది. అయితే, భార్య‌కు గుట్కా, పొగాకు తినే అల‌వాటు ఉండ‌టంతో ద‌పంతుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. ఆ అల‌వాటు మానుకోవాలంటూ భ‌ర్త మంద‌లించ‌డంతో ఆమె అలిటి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత భర్త, అతని కుటుంబ సభ్యులు తనను కట్నం కోసం వేధించారని, ఆ వేధింపుల భరించలేకే తాను కాపురం వదిలి రావాల్సి వచ్చిందని ఆరోపిస్తూ భార్య ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు భ‌ర్త‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

దాంపత్య హ‌క్కుల కోసం భ‌ర్త పోరాటం..

దీంతో భర్త ముస్లిం చట్టం కింద దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించాడు. ఈ మేర‌కు త‌న‌పై న‌మోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాల‌ని పిటిష‌న్‌లో కోరాడు. ఈ కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు.. భార్య తన భర్త వద్దకు వెళ్లి కాపురం చేయాలని మార్చి 10, 2026 న తీర్పు వెలువరించింది. అయినప్పటికీ భార్య తిరిగి వెళ్లలేదని, తనపై పెట్టిన ఎఫ్‌ఐఆర్ కేవలం కక్ష సాధింపు చర్యేనని భర్త వాదించారు.

దాన్ని బ‌ల‌హీన‌త‌గా భావించ‌లేం..

ఈ కేసును విచారించిన కోర్టు ఎఫ్ఐఆర్ క‌క్ష సాధింపు చ‌ర్య‌గా దాఖ‌లు చేసిన‌ట్లు నిరూపించ‌డానికి త‌గిన ఆధారాలు ఏమీ లేవ‌ని స్ప‌ష్టం చేసింది. భర్త దాంపత్య హక్కుల పిటిషన్ వేశారు కదా అని క్రిమినల్ కేసును కొట్టివేయలేమని స్ప‌ష్టం చేసింది. కాపురం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో భార్య కొంతకాలం వేధింపులను భరిస్తూ నిశ్శబ్దంగా ఉంటే, దానిని ఆమె బలహీనతగా భావించ‌లేమ‌ని ధర్మాసనం పేర్కొంది. రాజీకుదిరే మార్గం లేదని, అత్తమామల వేధింపులు హద్దు మీరాయని భావించిన తర్వాతే ఆమె ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేర‌కు భ‌ర్త వేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. అయితే, ఆమె అత్త‌, ఆడ‌ప‌డుచుల‌పై ఎలాంటి నిర్ద‌ష్ట‌మైన ఆరోప‌ణ‌లు లేక‌పోవ‌డంతో వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను మాత్రం హైకోర్టు రద్దు చేసింది.

Also Read..

కాంట్రాక్ట్ మ‌హిళా ఉద్యోగులూ ప్ర‌సూతి సెల‌వుల‌కు అర్హులే.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

సోనియా గాంధీ ఇన్‌స్టా ఖాతాకు ఫాలోవ‌ర్ల వెల్లువ‌.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే

అధికార మార్పే ల‌క్ష్యంగా అరాచ‌కాలు

Advertisement
Advertisement