త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singireddy Niranjan Reddy | జూప‌ల్లి! ఇగో నార్లాపూర్ రిజ‌ర్వాయ‌ర్‌కొచ్చిన‌.. మేమిచ్చే స‌ల‌హానైనా అమ‌లు చెయ్‌

Singireddy Niranjan Reddy | మంత్రి జూపల్లి కృష్ణారావు స‌వాల్‌ను స్వీక‌రించి గురువారం నార్లాపూర్ రిజ‌ర్వాయ‌ర్‌ను సంద‌ర్శించామ‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) తెలిపారు.

S

Telangana | Published On Oct 22, 2026, 5.33 pm IST

Singireddy Niranjan Reddy | జూప‌ల్లి! ఇగో నార్లాపూర్ రిజ‌ర్వాయ‌ర్‌కొచ్చిన‌.. మేమిచ్చే స‌ల‌హానైనా అమ‌లు చెయ్‌
Advertisement
  • తుండును తొల‌గిస్తే గ్రావిటీతో ఏదుల‌, వట్టెం, క‌రివెన రిజ‌ర్వాయ‌ర్లు నింపొచ్చు
  • మీకు చేత‌గాక‌పోతే చెప్పు.. మేం నింపి చూపిస్తం
  • వెట‌కార‌పు మాట‌లు ఆపి.. నీళ్లు ఎలా ఇవ్వాలో ఆలోచించు
  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి హిత‌వు

Singireddy Niranjan Reddy | త్రినేత్ర న్యూస్‌: మంత్రి జూపల్లి కృష్ణారావు స‌వాల్‌ను స్వీక‌రించి గురువారం నార్లాపూర్ రిజ‌ర్వాయ‌ర్‌ (Narlapur Reservoir) ను సంద‌ర్శించామ‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) తెలిపారు. సాంకేతిక అంశాలు జోడించి, పరిణతితో రెండు పంపుల సామార్థ్యానికి సరిపోను తుండును తొలగిస్తే గ్రావిటీ ద్వారా ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లకు నీళ్లు తరలించవచ్చన్నారు. తామిచ్చే స‌ల‌హాను అమ‌లు చేస్తే రైతుల‌కు నీళ్లివ్వొచ్చ‌ని చెప్పారు. మీకు చేతకాకపోతే జీవో ఇచ్చి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇస్తే తామే దగ్గరుండి కట్టను తొలిగించి.. రిజర్వాయర్లు నింపి చూపిస్తామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. వెట‌కార‌పు మాట‌లు ఆపి రైతుల‌కు నీళ్లు ఎలా ఇవ్వాలో ఆలోచించాల‌ని హిత‌వు ప‌లికారు.

నీళ్లు సహజంగానే పారతాయి.. నీలాగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్‌ చేసే గుణం నీళ్లకు ఉండదు. ప్రభుత్వ పరంగా జీవో ఇచ్చి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇవ్వండి. నార్లపూర్ నుండి నీళ్లు తరలించి రిజర్వాయర్లు నింపి చూపిస్తం. మూడేళ్లుగా పాలమూరు రంగారెడ్డిని పడావ్ పెట్టి కుంటి సాకులు చూపుతూ రైతులను హరిగోస పెడుతున్నారు. నార్లాపూర్ 10 పంపులు ఒకేసారి నడిస్తే 26 వేల క్యూసెక్కుల నీళ్లు ఈ కాలువ ద్వారా పారుతాయి.

చిన్న పని కూడా చేత‌నైత‌లే మీకు..

ప్రస్తుతం రెండు పంపులు మాత్రమే నడుస్తున్నాయి కాబట్టి తుండు కట్టలో పావు భాగం మట్టిని తొలగించిన నీళ్లు గ్రావిటీ ద్వారా రిజర్వాయర్లకు చేరుకుంటాయి. జిల్లా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తుండు కట్టను తొలిగించి నీళ్లు అందించాలి. మూడేండ్లలో మీకు ఈ చిన్న పని కూడా చేయడం చేతకావడం లేదు.

కేసీఆర్ 27 వేల ఎకరాల భూసేకరణ చేసి రూ. 35 వేల కోట్లు ఖర్చు పెట్టి 70 టీఎంసీల నీళ్లు నింపుకునే ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లు సిద్ధంగా ఉంచారు. కేసీఆర్ కి పేరు వస్తుందని పాలమూరు-రంగారెడ్డిని పడావు పెట్టారు. జూరాల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి 245 టీఎంసీల నీళ్లు చేరాయి. రేవంత్ నిర్లక్ష్యంతో 100కు పైగా టీఎంసీల నీరు ఆంధ్రాకు తరలిపోయాయి. నేటికి శ్రీశైలంలో 60 టీఎంసీల నీటి లభ్యత ఉంది. 20 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తే వానాకాలం పంటలు కాపాడగలుగుతాం. భూగర్భ జలాలు పెరిగి ప్రజల అవసరాలు తీరుతాయి అని నిరంజ‌న్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement