Sonia Gandhi | సోనియా గాంధీ ఇన్‌స్టా ఖాతాకు ఫాలోవర్ల వెల్లువ.. గంటల వ్యవధిలోనే
Sonia Gandhi | కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు (Instagram account) ఫాలోవర్లు వెల్లువెత్తుతున్నారు. కేవలం ఐదు గంటల వ్యవధిలో ఫాలోవర్ల సంఖ్య 80 వేలు దాటడం విశేషం.
Sonia Gandhi | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తొలిసారి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖాతా తెరిచిన కొన్ని క్షణాల్లోనే సోనియా ఇన్‌స్టా పేజ్‌కు ఫాలోవర్లు వెల్లువెత్తుతున్నారు. కేవలం ఐదు గంటల వ్యవధిలో ఫాలోవర్ల సంఖ్య 80 వేలు దాటడం విశేషం. అంతేకాదు సోనియా పెట్టిన ఫస్ట్ పోస్టుకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. అయితే, సోనియా మాత్రం ముగ్గురిని మాత్రమే ఫాలో అవుతున్నారు.
అందులో రాహుల్, ప్రియాంకతోపాటూ కాంగ్రెస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఫాలో అవుతుండటం విశేషం. ఇప్పటి వరకూ ఎలాంటి సోషల్ మీడియా ఖాతానూ (ట్విట్టర్, ఫేస్‌బుక్) నిర్వహించని సోనియా గాంధీ.. ఫస్ట్‌టైమ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దేశ యువతకు మరింత చేరువయ్యేందుకే సోనియా ఈ ఖాతాను తెరిచారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఇన్‌స్టా ఖాతా ఓపెన్ చేసిన సోనియా ఇప్పటి వరకూ కేవలం రెండు పోస్టులను మాత్రమే చేశారు. అందులో ఒకటి తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియో కాగా, మరో పోస్టులో అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సోనియా ఆత్మకథ..
ఇదిలా ఉండగా.. సోనియా గాంధీ (Sonia Gandhi) ‘బిలాంగిగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో తన ఆత్మకథను పుస్తక రూపంలో తీసుకువస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో ఈ పుస్తక ప్రచురణ హక్కుల్ని హార్పర్‌కాలిన్స్ ఇండియా (HarperCollins India) దక్కించుకుంది. నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ బుక్ విడుదల కానుంది. ఈ సందర్భంగా హార్పర్ కాలిన్స్ ఇండియా తొలి ప్రచురణను సోనియాకు అందజేసింది.
యుద్ధానంతర ఇటలీలో బాల్యం, భారతదేశంలో తన జీవితం, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ప్రేమ-వివాహం, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యల తాలూకు విషాదాలు, రాజకీయ ప్రవేశం వంటి ఎన్నో వ్యక్తిగత, రాజకీయ ప్రయాణాలను సోనియా ఈ ఆత్మకథలో పొందుపరిచారు. అంతేకాదు, 2004లో తాను ప్రధానమంత్రి పదవిని ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందనే విషయాలను కూడా సోనియా ఈ బుక్‌లో వివరించారు.





Also Read..
ప్రియాంక గాంధీ కుమారుడి ఫొటో ఎగ్జిబిషన్‌పై వివాదం.. స్పందించిన బికనేర్ హౌస్
పూణేలో కలకలం.. డెంగ్యూతో 9 ఏళ్ల చిన్నారి మృతి.. అసలు ఏం జరిగింది?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై విచారణ జరపండి: ఇరిగేషన్ శాఖ కార్యదర్శికి ఎంపీ చామల లేఖ
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sara Arjun | సారా అర్జున్ వర్సెస్ మమితా బైజు - రామ్‌చరణ్‌తో జోడీ కట్టేది ఎవరంటే?
- ●Ponnam Prabhakar | ఒక్క పట్టభద్రుని ఓటు మిస్సవ్వొద్దు.. కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెడదాం
- ●RBI | రూపాయిని నిలబెట్టేందుకు ఆర్బీఐ అంత ఖర్చు చేసిందా..?
- ●Suryaa Ant Se Aarambh Tak | 'సూర్య' సినిమాపై నిషేధం విధించండి.. కేంద్రమంత్రికి ఐఎంఏ లేఖ! అసలు వివాదం ఏంటి?
- ●CM Revanth Reddy | కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన.. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పనుల పరిశీలన
- ●Tummala Nageshwar Rao | నేల తల్లిని సంరక్షించుకోవాలి

Sara Arjun | సారా అర్జున్ వర్సెస్ మమితా బైజు - రామ్‌చరణ్‌తో జోడీ కట్టేది ఎవరంటే?

Ponnam Prabhakar | ఒక్క పట్టభద్రుని ఓటు మిస్సవ్వొద్దు.. కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెడదాం

RBI | రూపాయిని నిలబెట్టేందుకు ఆర్బీఐ అంత ఖర్చు చేసిందా..?

Suryaa Ant Se Aarambh Tak | 'సూర్య' సినిమాపై నిషేధం విధించండి.. కేంద్రమంత్రికి ఐఎంఏ లేఖ! అసలు వివాదం ఏంటి?






