త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Double Bed Room House | అర్హ‌త లేని వారికి డ‌బుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులు..

Double Bed Room House | బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలో నిర్మించిన మిగిలిన డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌ను పార‌ద‌ర్శ‌కంగా అర్హులైన నిరుపేద‌ల‌కు కేటాయించాల‌ని కోరుతూ.. గృహ నిర్మాణ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి వీపీ గౌత‌మ్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

S

Telangana | Published On Oct 22, 2026, 5.36 pm IST

Double Bed Room House | అర్హ‌త లేని వారికి డ‌బుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులు..
Advertisement

విచార‌ణ జ‌రిపించాల‌ని ప్ర‌భుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విన‌తి

Double Bed Room House | త్రినేత్ర న్యూస్ : బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలో నిర్మించిన మిగిలిన డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌ను పార‌ద‌ర్శ‌కంగా అర్హులైన నిరుపేద‌ల‌కు కేటాయించాల‌ని కోరుతూ.. గృహ నిర్మాణ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి వీపీ గౌత‌మ్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఇళ్ల కేటాయింపుల్లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని, దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. స‌చివాల‌యంలో వీపీ గౌత‌మ్‌కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించిన అనంత‌రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు.

ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో స్ప‌ష్ట‌మైన విధివిధానాలు లేకుండా ఇళ్ల‌ను కేటాయించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అర్హ‌త లేని వ్య‌క్తుల‌కు రాజ‌కీయ ప‌లుకుబ‌డి, వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాలు, సిఫార‌సుల ఆధారంగా ఇళ్లు కేటాయిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా మంత్రులు, అధికారుల వ‌ద్ద డ్రైవ‌ర్లుగా లేదా స‌హాయ‌కులుగా ప‌ని చేస్తున్న వారికి సిఫార‌సుల లేఖ‌ల ఆధారంగా విలువైన ఇళ్ల‌ను కేటాయిస్తున్నార‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సి ఉంది. ఈ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలితే అర్హులైన నిరుపేద‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంది. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఖైతలాపూర్ డ‌బుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో ఈ అక్ర‌మాలు చోటు చేసుకున్న‌ట్లు మా దృష్టికి వ‌చ్చింది. ఇందుకు సంబంధించి స్ప‌ష్ట‌మైన ఆధారాలతో త‌హ‌సీల్దార్, క‌లెక్ట‌ర్, రెవెన్యూ మంత్రి, సీఎంకు ఫిర్యాదు చేసినా.. చ‌ర్య‌లు తీసుకోలేదు. ఈ క్ర‌మంలో స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు.

Advertisement
Advertisement