త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramachander Rao | అధికార మార్పే ల‌క్ష్యంగా అరాచ‌కాలు

Ramachander Rao | ప్రజల మనసులను, విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ, అధికార మార్పే లక్ష్యంగా అరాచకాలను ప్రోత్సహిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలకు పాల్పడుతోంది అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Oct 22, 2026, 6.01 pm IST

Ramachander Rao | అధికార మార్పే ల‌క్ష్యంగా అరాచ‌కాలు
Advertisement

నెహ్రూ - గాంధీ కుటుంబం ప‌ట్ల కాంగ్రెస్‌కు గుడ్డి విధేయ‌త‌
కాంగ్రెస్ పార్టీపై రామ‌చంద‌ర్ రావు తీవ్ర విమ‌ర్శ‌లు

Ramachander Rao | త్రినేత్ర న్యూస్ : ప్రజల మనసులను, విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ, అధికార మార్పే లక్ష్యంగా అరాచకాలను ప్రోత్సహిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలకు పాల్పడుతోంది అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు ధ్వ‌జ‌మెత్తారు. ఈరోజు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో క‌లిసి త్వ‌ర‌లో చేప‌ట్ట‌నున్న లోక్‌తంత్ర బ‌చావో, బీద్‌తంత్ర హ‌ఠావో ప్ర‌చార కార్య‌క్ర‌మానికి సంబంధించిన స‌న్న‌హక స‌మావేశంలో రామ‌చంద‌ర్ రావు ప్ర‌సంగించారు.

కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కంటే నెహ్రూ–గాంధీ కుటుంబం పట్ల గుడ్డి విధేయతే పరమావధిగా మారింది. ఇలాంటి అరాచకాలను చూసి భారతదేశం ఇకపై మౌనంగా ఉండదు. ప్రజల అభీష్టానికి బదులుగా గుంపుల దౌర్జన్యాన్ని రుద్దాలని ప్రయత్నించే అరాచక శక్తుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుట్రలను ప్రజల ముందు ఎండగట్టి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమాన్ని చేపట్టనున్నామ‌ని రామ‌చంద‌ర్ రావు స్ప‌ష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతి కుమార్, పలువురు సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement