త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maternity Leave | కాంట్రాక్ట్ మ‌హిళా ఉద్యోగులూ ప్ర‌సూతి సెల‌వుల‌కు అర్హులే.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

Maternity Leave | కాంట్రాక్ట్ మ‌హిళా ఉద్యోగులూ (Contractual Women Employees) ప్ర‌సూతి సెల‌వుల‌కు (Maternity Leave) అర్హులేన‌ని రాజ‌స్థాన్ హైకోర్టు (Rajasthan High Court) స్ప‌ష్టం చేసింది. కేవలం ఉద్యోగ స్వభావం (Nature of Employment) కారణం చూపిస్తూ చట్టబద్ధంగా లభించాల్సిన మాతృత్వ ప్రయోజనాలను నిరాకరించ‌లేమ‌ని తేల్చి చెప్పింది.

D

National | Published On Oct 22, 2026, 5.33 pm IST

Maternity Leave | కాంట్రాక్ట్ మ‌హిళా ఉద్యోగులూ ప్ర‌సూతి సెల‌వుల‌కు అర్హులే.. కోర్టు సంచ‌ల‌న తీర్పు
Advertisement

Maternity Leave | త్రినేత్ర న్యూస్ : రాజ‌స్థాన్ హైకోర్టు (Rajasthan High Court) సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. కాంట్రాక్ట్ మ‌హిళా ఉద్యోగులూ ప్ర‌సూతి సెల‌వుల‌కు (Maternity Leave) అర్హులేన‌ని స్ప‌ష్టం చేసింది. తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్నార‌న్న ఒకే ఒక్క కార‌ణంతో వారికి మెట‌ర్నిటీ లీవ్ నిరాక‌రించ‌డం స‌రికాద‌ని పేర్కొంది. కేవలం ఉద్యోగ స్వభావం (Nature of Employment) కారణం చూపిస్తూ చట్టబద్ధంగా లభించాల్సిన మాతృత్వ ప్రయోజనాలను నిరాకరించ‌లేమ‌ని తేల్చి చెప్పింది.

రాజ‌స్థాన్ రాష్ట్ర కాలుష్య నియంత్ర‌ణ మండ‌లిలో కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్న ఓ మ‌హిళ త‌న‌కు 6 నెల‌ల ప్ర‌సూతి సెల‌వు కావాల‌ని ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఆమె ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించిన ప్ర‌భుత్వం సెల‌వు ఇచ్చేందుకు నిరాక‌రించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప‌నిచేస్తున్న ఉద్యోగికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సెలవులు మినహా ఇతర సెలవులు ఏవీ వర్తించవని నియామ‌క ఉత్త‌ర్వుల్లో ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ కార‌ణంగా ఆమె ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించింది. ఈ నిర్ణ‌యంతో స‌ద‌రు మ‌హిళ హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ మేర‌కు పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

విచార‌ణ సంద‌ర్భంగా మ‌హిళ‌లు కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న లేదా క‌న్స‌ల్టెంట్లుగా ఏ రూపంలో ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ వారికి మాతృత్వ ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయ‌ని కేంద్ర కార్మిక‌, ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖ‌ను పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జస్టిస్ బిపిన్ గుప్తా నేతృత్వంలోని బెంచ్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్రసూతి సెలవులు అంటే కేవలం ఉద్యోగానికి సెలవు పెట్టడం మాత్రమే కాదని, పుట్టిన బిడ్డతో తల్లి మానసిక బంధాన్ని పెంచుకోవడానికి, ప్రసవం తర్వాత కోలుకోవడానికి ఇది ఒక చట్టబద్ధమైన హక్కు అని వ్యాఖ్యానించింది. ఉద్యోగ స్వభావం ఆధారంగా మాతృత్వ సెలవులను నిరాకరించలేమ‌ని స్ప‌ష్టం చేసింది.

కాంట్రాక్ట్, తాత్కాలిక (Temporary), రోజువారీ వేతనం (Daily wage), లేదా అడ్హాక్ (Ad-hoc) ప్రాతిపదికన పనిచేసే మహిళా ఉద్యోగులకు కూడా శాశ్వత (Permanent) ఉద్యోగులతో సమానంగా మాతృత్వ ప్రయోజనాలు వ‌ర్తిస్తాయ‌ని సుప్రీంకోర్టు 2000 సంవత్సరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ ఫీమేల్ వర్కర్స్ కేసులో స్ప‌ష్టం చేసిన విష‌యాన్ని హైకోర్టు ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించింది. కంపెనీ లేదా సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం (Service Contract) కంటే మాతృత్వ ప్రయోజనాల చట్టంలోని సెక్షన్ 27 కింద ఉన్న నిబంధనలకే ఎక్కువ విలువ ఉంటుంద‌ని కోర్టు తేల్చిచెప్పింది. పిటిషనర్ కోరిన మాతృత్వ సెలవు ఆమె కాంట్రాక్ట్ కాలపరిమితిలోనే ఉన్నందున, ప్రయోజనాలను నిరాకరించడం చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేర‌కు పిటిషనర్‌కు తక్షణమే మాతృత్వ సెలవులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Also Read..

సోనియా గాంధీ ఇన్‌స్టా ఖాతాకు ఫాలోవ‌ర్ల వెల్లువ‌.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే

ప్రియాంక గాంధీ కుమారుడి ఫొటో ఎగ్జిబిష‌న్‌పై వివాదం.. స్పందించిన బిక‌నేర్ హౌస్‌

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మ‌ళ్లింపుపై విచార‌ణ జ‌ర‌పండి: ఇరిగేష‌న్ శాఖ కార్య‌ద‌ర్శికి ఎంపీ చామ‌ల లేఖ‌

Advertisement
Advertisement