త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG | ఎల్పీజీ ఉత్ప‌త్తిని 30 శాతం పెంచాం.. పానిక్ బుకింగ్స్ వ‌ద్దు : ప్ర‌భుత్వం

LPG | దేశంలో వంట గ్యాస్ కొర‌త లేద‌ని ప్ర‌భుత్వం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ఎల్పీజీ (LPG) స‌ర‌ఫ‌రాపై ఆందోళ‌న వ‌ద్ద‌ని సూచించింది. స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు ఏర్ప‌డొచ్చ‌నే ఆందోళ‌న‌ల‌తో అవ‌స‌రం లేకున్నా ముంద‌స్తు బుకింగ్‌లు చేయొద్ద‌ని ప్ర‌జ‌ల‌ను కోరింది.

D

National | Published On Mar 13, 2026, 4.57 pm IST

LPG | ఎల్పీజీ ఉత్ప‌త్తిని 30 శాతం పెంచాం.. పానిక్ బుకింగ్స్ వ‌ద్దు : ప్ర‌భుత్వం
Advertisement

LPG | దేశంలో వంట గ్యాస్ కొర‌త లేద‌ని ప్ర‌భుత్వం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ఎల్పీజీ (LPG) స‌ర‌ఫ‌రాపై ఆందోళ‌న వ‌ద్ద‌ని సూచించింది. స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు ఏర్ప‌డొచ్చ‌నే ఆందోళ‌న‌ల‌తో అవ‌స‌రం లేకున్నా ముంద‌స్తు బుకింగ్‌లు చేయొద్ద‌ని ప్ర‌జ‌ల‌ను కోరింది. దేశీయంగా వంట గ్యాస్ ల‌భ్య‌త‌ను నిర్ధారించ‌డానికి ప్ర‌భుత్వం ఉత్ప‌త్తిని పెంచింద‌ని పెట్రోలియం, స‌హ‌జ వాయువు మంత్రిత్వ శాఖ (Ministry of Petroleum and Natural Gas) జాయింట్ సెక్ర‌ట‌రీ సుజాత శ‌ర్మ (Sujata Sharma) తెలిపారు.

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దేశ‌వ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని (LPG production) సుమారు 30 శాతం పెంచినట్లు వెల్ల‌డించారు. అందుకే ఎల్పీజీ స‌ర‌ఫ‌రాపై ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందొద్ద‌ని సూచించారు. కంగారు ప‌డి పానిక్ బుకింగ్స్ చేయొద్ద‌ని పేర్కొన్నారు. ప‌రిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంద‌ని.. స‌ర‌ఫ‌రా స‌జావుగా సాగుతోంద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. యుద్ధానికి ముందు రోజుకు స‌గ‌టున 55.7 ల‌క్ష‌ల బుకింగ్‌లు ఉండ‌గా.. ఇప్పుడు ఆ సంఖ్య 75.7 ల‌క్ష‌ల‌కు చేరింద‌ని చెప్పారు. ఇది ప్ర‌జ‌ల్లో ఉన్న ఆందోళ‌న‌ను సూచిస్తోంద‌ని పేర్కొన్నారు. ఎల్పీజీ కొర‌త‌పై వదంతులు న‌మ్మొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం అస్స‌లు లేద‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు భార‌త్ త‌న ఎల్పీజీ అవ‌స‌రాల కోసం కొంత వ‌ర‌కూ దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం ఉన్న‌ నిల్వ‌లు, పెంచిన ఉత్ప‌త్తి గృహ అవ‌స‌రాల‌కు స‌రిపోతాయ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. రిఫైన‌రీలు త‌గినంత ముడి చ‌మురు నిల్వ‌ల‌తో న‌డుస్తున్నాయ‌న్నారు. సిలిండ‌ర్ల పంపిణీలో ఎలాంటి అంత‌రాయాలూ క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని వెల్ల‌డించారు.

Also Read..

వంట‌గ్యాస్ పై అపోహ‌లొద్దు.. కావాల్సినంత ఉంది

పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు.. లాభం పొందుతున్న రష్యా, చైనా..!

కామాఖ్య-చర్లపల్లి మధ్య అమృత్‌ భారత్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

Advertisement
Advertisement