Uttham kumar reddy | వంటగ్యాస్ పై అపోహలొద్దు.. కావాల్సినంత ఉంది : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ రాష్ట్రంలో వంటగ్యాస్ కొరత (Gas shortage) ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttham Kumar Reddy) అన్నారు. ప్రజల్లో లేని పోని అపోహలు (Rumors) సృష్టించే వారిపట్ల అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
- బాట్లింగ్ ప్లాంట్లలో కొరత లేదు
- సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతోనే ఈ దుస్థితి
- అపోహలను అడ్డు పెట్టుకుని బ్లాక్ చేస్తే ఉపేక్షించం
- ఇప్పటికే 288 కేసులు నమోదు చేశాం
- అసత్య ప్రచారాన్ని తిప్పి కొడదాం
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ
- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

త్రినేత్ర.న్యూస్: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ రాష్ట్రంలో వంటగ్యాస్ కొరత (Gas shortage) ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttham Kumar Reddy) అన్నారు. ప్రజల్లో లేని పోని అపోహలు (Rumors) సృష్టించే వారిపట్ల అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయం (Secretariat) లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar rao), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి కలెక్టర్లు (Collectors), ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ (Video conference) నిర్వహించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (chief secretary) ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ (High level committee) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
రోజువారీ బుకింగ్స్ 72 శాతం..
ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎటువంటి గందరగోళానికి గురి కావొద్దన్నారు. గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంతోనే కృత్రిమంగా గ్యాస్ కొరతను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు. ఇటువంటి గందరగోళం ఏర్పడినందునే రోజువారీగా 72% బుకింగ్స్ జరుగుతున్నాయని చెప్పారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రిలకు, విద్యా సంస్థలకు, వృద్దాశ్రమలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధన్య క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని తెలిపారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు...
రాష్ట్రంలో 810 ఎల్పీజీ పంపిణీదారుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల కనెక్షన్లు (29 lakhs connections) ఉండగా రోజువారీగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్ల(Bottling plant)లో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. అపోహలను అడ్డు పెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఉపేక్షించదని, కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందని హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్ నిల్వ చేయడం, మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడినవారిపై ఇప్పటి వరకు 288 కేసులు (288 cases) నమోదు చేశామన్నారు. ఎల్పీజీ పంపిణీదారులు ప్రవర్తన మార్చుకోకుంటే మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ (command control center) ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అవసరానికి మించి తీసుకోవద్దు..
ఆయా జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకోసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకోసారి ఎల్పీజీ బుక్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు. అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని వివరించారు. ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని మంత్రి వెల్లడించారు..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




