West Asia Crisis | పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు.. లాభం పొందుతున్న రష్యా, చైనా..!
West Asia Crisis | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలను ప్రభావం చేస్తున్నాయి. అయితే, ఈ సంక్షోభ సమయంలోనే రష్యా, చైనా భారీగానే లాభపడుతున్నాయని పెట్టుబడి బ్యాంక్ పెట్టుబడి బ్యాంకు జెఫరీస్ నివేదిక వెల్లడించింది.
International | Published On Mar 13, 2026, 4.06 pm IST
West Asia Crisis | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలను ప్రభావం చేస్తున్నాయి. అయితే, ఈ సంక్షోభ సమయంలోనే రష్యా, చైనా భారీగానే లాభపడుతున్నాయని పెట్టుబడి బ్యాంక్ పెట్టుబడి బ్యాంకు జెఫరీస్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ పరిమాణం రష్యాకు ఇంధన ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం పెంచుకునే అవకాశం కల్పిస్తోంది. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో రష్యా ప్రాధాన్యం మరింత బలపడే పరిస్థితి కనిపిస్తోంది.
రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షల సడలింపు..
రష్యా నుంచి చమురును కొనుగోలు చేయొద్దని అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో రష్యా నుంచి చమురును కొనుగోలు చేసేందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు. పలుదేశాలు పరిస్థితులు చక్కబడే వరకు చమురును మాస్కో నుంచి కొనుగోలు చేసుకోవచ్చంటూ సడలింపులు ఇచ్చారు. దాంతో అంతర్జాతీయంగా ఆందోళనలు కొంత వరకు తగ్గినట్లుగా నివేదిక పేర్కొంది. ప్రపంచ మార్కెట్‌లో ధరలు పెరుగుతుండడంతో రష్యా ఇంధన సరఫరా మళ్లీ కీలకంగా మారుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
చైనా మార్కెట్‌కు లాభం..
మరోవైపు చైనా తన దేశీయ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కారణంగా ఈ పరిస్థితి నుంచి ప్రయోజనం పొందుతోంది. చైనా ప్రభుత్వం స్టాక్ మార్కెట్‌ను క్రమంగా బలపర్చే వ్యూహంపై పని చేస్తోంది. భవిష్యత్తులో కుటుంబాల సంపద సృష్టికి ప్రధాన వేదికగా స్టాక్ మార్కెట్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. ప్రత్యేకంగా షాంఘై స్టాక్ మార్కెట్‌లో కనిపిస్తున్న స్థిరమైన వృద్ధిని ప్రభుత్వం దీర్ఘకాలిక విధానంలో భాగంగా చూస్తున్నట్టు వెల్లడించింది. అయితే, ప్రపంచ ఇంధన సరఫరా మార్గాల్లో అంతరాయం ఎక్కువకాలం కొనసాగితే గ్లోబల్ సరఫరా వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత ఎక్కువ కాలం కొనసాగితే ప్రపంచ ఇంధన మార్కెట్‌లో పెద్ద సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇంధన సంక్షోభం మధ్య అమెరికా కీలక నిర్ణయం
ఇదిలా ఉండగా అమెరికా ప్రభుత్వం వచ్చే వారం నుంచి తమ వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి సుమారు 172 మిలియన్ బ్యారెల్స్ చమురు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమెరికా ఇంధన వ్యూహంలో ముందస్తు ప్రణాళికలో లోపాలను ప్రతిబింబిస్తోందని నివేదిక సూచించింది. ప్రస్తుతం అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వలు సుమారు 415 మిలియన్ బ్యారెల్స్ వద్ద ఉన్నాయి. ఇది గరిష్ఠ సామర్థ్యం అయిన 714 మిలియన్ బ్యారెల్స్‌లో సుమారు 58 శాతం మాత్రమే. 2020 జూలైలో నమోదైన 656 మిలియన్ బ్యారెల్స్ స్థాయితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇదే సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడి నిర్ణయం ఆయన రాజకీయంగా ఆయనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని కొందరు అమెరికాకు సంభవించే సూయిజ్ తరహా సంక్షోభంతో పోలుస్తున్నారు. సూయిజ్ మూమెంట్ అంటే ఒక శక్తివంతమైన దేశం అంతర్జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని కోల్పోతున్న సంకేతాలను చూపించే చారిత్రాత్మక మలుపు. ఈ పదం 1956లో జరిగిన సూయజ్ సంక్షోభం నుంచి పుట్టుకొచ్చింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






