త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lok Sabha | ప్రారంభ‌మైన లోక్‌స‌భ‌.. విప‌క్షాల నిర‌స‌న‌

Lok Sabha | పార్ల‌మెంట్ ప్ర‌త్యేక సమావేశాలు రెండోరోజు తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌లు స‌మావేశ‌మ‌య్యాయి. లోక్‌స‌భ (Lok Sabha) ప్రారంభం కాగానే విప‌క్షాలు (Opposition) నిర‌స‌న‌కు దిగారు.

D

National | Published On Apr 17, 2026, 11.28 am IST

Lok Sabha | ప్రారంభ‌మైన లోక్‌స‌భ‌.. విప‌క్షాల నిర‌స‌న‌
Advertisement

Lok Sabha | పార్ల‌మెంట్ ప్ర‌త్యేక సమావేశాలు రెండోరోజు తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌లు స‌మావేశ‌మ‌య్యాయి. లోక్‌స‌భ (Lok Sabha) ప్రారంభం కాగానే విప‌క్షాలు (Opposition) నిర‌స‌న‌కు దిగారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై స‌భ‌లో చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చిందంటూ ప్ర‌భుత్వం గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డాన్ని విప‌క్షాలు త‌ప్పుబ‌ట్టాయి. ఈ మేర‌కు కేంద్రానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపాయి. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ గంద‌ర‌గోళం మ‌ధ్యే స‌భా కార్య‌క‌లాపాలు సాగుతున్నాయి. ఈ కీల‌క బిల్లుపై చ‌ర్చ కొన‌సాగుతోంది.

అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం..

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు ఉద్దేశించిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ చ‌ట్టం-2023 (Womens Reservation Act 2023) అమ‌ల్లోకి వ‌చ్చింది. గురువారం నుంచి ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు కేంద్రం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు గురువారం అర్ధ‌రాత్రి త‌ర్వాత కేంద్ర న్యాయ‌శాఖ (Union Law Ministry) గెజిట్ నోటిఫికేష‌న్ (Gazette notification) విడుద‌ల చేసింది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం-2023లోని సెక్షన్‌-1లో ఉన్న సబ్‌ సెక్షన్‌-2 ప్రకారం 2026 ఏప్రిల్‌ 16వ తేదీని మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చే తేదీగా ప్రభుత్వం నిర్ణయించిందని నోటిఫికేషన్‌లో న్యాయశాఖ పేర్కొంది.

Also Read..

అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం.. గెజిట్ విడుద‌ల చేసిన న్యాయ‌శాఖ‌

స్త్రీ శ‌క్తే.. బ‌ల‌మైన భార‌త్‌కు గుర్తింపు : ప్ర‌ధాని మోదీ

కేంద్ర మంత్రితో బాలీవుడ్‌ న‌టి ప్రేమాయ‌ణం.. క్లారిటీ ఇచ్చిన కంగ‌నా ర‌నౌత్

Advertisement
Advertisement