Padi Kaushik Reddy vs Ponguleti Srinivas Reddy | ప్రభుత్వ వేదికపై పాలిటిక్స్ వద్దు: ఆ ఇండ్లు బరాబర్ కేసీఆర్ కట్టినవే
కమలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ సభలో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యే. వేదికపై మంత్రులు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Karimnagar | Published On Aug 10, 2026, 4.25 pm IST
- కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం
- గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పథకాల అమలు ఆలస్యం అవుతోందని మంత్రులు పొంగులేటి, పొన్నం వ్యాఖ్యలు
- మంత్రుల ప్రసంగానికి అడ్డుతగిలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
- ప్రభుత్వ వేదికపై రాజకీయాలు తగవని, ఆ ఇండ్లు బరాబర్ కేసీఆర్ ప్రభుత్వమే కట్టిందని కౌశిక్ రెడ్డి స్పష్టీకరణ
Padi Kaushik Reddy vs Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల (Double Bedroom Houses) ప్రారంభోత్సవ వేదిక రాజకీయ విమర్శలకు కేరాఫ్‌గా మారింది. కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం సభా ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తున్న సమయంలో.. కౌశిక్ రెడ్డి జోక్యం చేసుకుని వారి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.
అప్పులపై పొంగులేటి కామెంట్స్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఆ అప్పుల కారణంగానే అనుకున్న కార్యక్రమాలను పూర్తిగా ప్రజలకు ఇవ్వలేకపోతున్నామని అన్నారు. అయినప్పటికీ ప్రజా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో హామీలను నెరవేర్చి తీరుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్న పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. "కేసీఆర్ కట్టిన వాటిని మేము ముట్టుకోము అనే విధానం మాకు లేదు. ప్రజాపాలనలో అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ (Continuous Process). ఈ క్రెడిట్ ఫౌండేషన్ వేసిన వాళ్లదా కాదా అనేది ప్రజలు ఆలోచించాలి" అని పరోక్షంగా బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు.
అభ్యంతరం తెలిపిన కౌశిక్ రెడ్డి
మంత్రుల కామెంట్స్‌తో వేదికపైనే ఉన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంత్రులు మాట్లాడుతున్న సమయంలో మైక్ తీసుకుని వారి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. "అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ప్రభుత్వ కార్యక్రమంలో పాలిటిక్స్ (Politics) చేయొద్దు" అంటూ మంత్రుల తీరును తప్పుబట్టారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు.
బరాబర్ కేసీఆర్ కట్టినవే
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మంత్రులతో వాగ్వాదానికి దిగారు. "అన్న నేను చెప్పేది వినండి.. బరాబర్ ఈ ఇండ్లు కేసీఆర్ గారు కట్టిండే. ఇవి కేసీఆర్ గారు కట్టినవే సార్.. ఒక్క నిమిషం వినండి" అంటూ వేదికపైనే కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేటప్పుడు రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని, ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని ఆయన స్పష్టం చేశారు. దీంతో సభా ప్రాంగణంలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.
ముమ్మాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మా కేసీఆర్ కట్టినవే
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే ఇచ్చామని చెప్పుకుంటూ సభ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
మీరిచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే అంటూ పొన్నం ప్రభాకర్‌తో వాగ్వాదానికి దిగిన కౌశిక్ రెడ్డి https://t.co/gCsDrBmqPf pic.twitter.com/MnyYjMqDKR
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Free Bus | సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ బస్?
అక్టోబర్ 4, 2026

Telangana Auto Drivers Welfare Board | ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త: త్వరలో వెల్ఫేర్ బోర్డు.. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల సబ్సిడీ
అక్టోబర్ 3, 2026

Uttam Kumar Reddy | గౌరవెల్లి భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి
- ●Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్
- ●India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!
- ●Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు
- ●Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...

Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి

Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్

India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!



