త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiara Advani | టాక్సిక్ త‌ర్వాత టాలీవుడ్ – మైథాల‌జీ మూవీలో కియారా అద్వానీ – రౌడీ బాయ్‌తో రొమాన్స్‌

టాక్సిక్ రిలీజ్ కాక‌ముందే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో క్రేజీ ఛాన్స్ ద‌క్కించుకుంది. రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రొమాన్స్ చేయ‌బోతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా హాయ్ నాన్న ఫేమ్ శౌర్య‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మైథాల‌జీ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా క‌న్ఫామ్ అయిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Aug 10, 2026, 4.19 pm IST

Kiara Advani | టాక్సిక్ త‌ర్వాత టాలీవుడ్ – మైథాల‌జీ మూవీలో కియారా అద్వానీ  – రౌడీ బాయ్‌తో రొమాన్స్‌
Advertisement

Kiara Advani | టాక్సిక్ గ్ల‌ర్ కియారా అద్వానీ తెలుగులో బంప‌రాఫ‌ర్ అందుకున్న‌ట్లు స‌మాచారం. రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఈ బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. య‌శ్ హీరోగా న‌టించిన టాక్సిక్ మూవీ ఆగ‌స్ట్ 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీలో ఐదుగురు హీరోయిన్లు న‌టించారు. వీరిలో ఎక్కువ‌గా కియారా అద్వానీ హైలైట్ అయ్యింది. టాక్సిక్‌లో కియారా అద్వానీ గ్లామ‌ర్‌కే ప‌రిమిత‌మ‌య్యే బోల్డ్ రోల్‌లో న‌టించిన‌ట్లు ఇన్నాళ్లు చాలానే విమ‌ర్శ‌లొచ్చాయి. కానీ టాక్సిక్‌ ట్రైల‌ర్‌లో ఆమె పాత్ర‌లో మ‌ల్టీపుల్ షేడ్స్ క‌నిపించాయి. ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి భిన్నంగా ఆమె క్యారెక్ట‌ర్‌ ఉండ‌బోతున్న‌ట్లు క‌నిపించింది. టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్‌ ప‌రంగా య‌శ్ మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

మ‌రో ల‌క్కీ ఛాన్స్‌...

కాగా టాక్సిక్ రిలీజ్ కాక‌ముందే కియారా అద్వానీ ద‌క్షిణాదిలో మ‌రో ల‌క్కీ ఛాన్స్ అందుకున్న‌ట్లు స‌మాచారం. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్‌గా ఈ మూవీ లాంఛ్ అయ్యింది. ఈ గ్లోబ‌ల్ యాక్ష‌న్ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వానీ ఖ‌రారైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పౌరాణిక పాత్ర‌కు సూట‌య్యే హీరోయిన్ కోసం చాలానే అన్వేషించిన మేక‌ర్స్ చివ‌ర‌కు ఈ బాలీవుడ్ బ్యూటీని ఫైన‌ల్ చేసిన‌ట్లు చెబుతున్నారు. రెండు కాలాల్లో సాగే ఈ క‌థ‌లో ఓ పాత్ర‌లో ట్రెడిష‌న‌ల్‌గా, మ‌రో క్యారెక్ట‌ర్‌లో చాలా మోడ్ర‌న్‌గా కియారా అద్వానీ పాత్ర ఉంటుంద‌ని అంటున్నారు.

హాలీవుడ్ టెక్నీషియ‌న్లు...

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ మైథాల‌జీ మూవీకి ప‌లువురు హాలీవుడ్ టెక్నీషియ‌న్లు ప‌నిచేయ‌బోతున్నారు. హౌజ్ ఆఫ్ డ్రాగ‌న్ ఫేమ్ అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా...గాడ్ ఆఫ్ ఈజిప్ట్‌, స్నో పిర్స‌ర్ సినిమాల‌కు వీఎఫ్ఎక్స్ అందించిన ఎరిక్ డ‌స్ట్ ఈ సినిమాలో భాగ‌మ‌య్యాడు. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ భారీ బ‌డ్జెట్ మూవీ సెట్స్‌పైకి రానున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ణ‌బాలితో పాటు రౌడీ జ‌నార్ధ‌న సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ రెండు సినిమాలు థియేట‌ర్ల‌లోకి రానున్నాయి.

 

Advertisement
Advertisement