Nepal Flash Floods | ఉప్పొంగిన నది.. కొట్టుకుపోయిన గ్రామాలు
Nepal Flash Floods | నేపాల్‌ను మెరుపు వరదలు (Nepal Flash Floods) అతలాకుతలం చేశాయి. భోటే కోషి నది (Bhote Koshi River)లో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగింది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వర్షాల కారణంగా ఈ వరదలు సంభవించలేదని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నదిలో వరద ఆకస్మికంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
International | Published On Aug 26, 2026, 2.28 pm IST
Nepal Flash Floods | త్రినేత్ర.న్యూస్ : హిమాలయ దేశం నేపాల్‌ను మెరుపు వరదలు (Nepal Flash Floods) ముంచెత్తాయి. బుధవారం ఉదయం సంభవించిన ఆకస్మిక వరదలకు గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. అనేక బ్రిడ్జులు ధ్వంసమయ్యాయి. అనేక మంది గల్లంతయ్యారు. విచిత్రం ఏంటంటే..? ఇక్కడ ఆకస్మిక వరదలకు వర్షాలు కారణం కాకపోవడం గమనార్హం.
టిబెట్ ప్రాంతం నుంచి ఉద్భవించే భోటే కోషి నదిలో ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. టిబెట్ సరిహద్దు సమీపంలోని రసువా (Rasuwa) జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ఈ వరదలు అతలాకుతలం చేశాయి. ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. నది సరిహద్దు గ్రామాలైన టిమురే, స్యాబ్రేబేసి తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
भोटेकोसी नदी रसुवामा तिब्बत तर्फबाट ठुलो बाढी प्रवेश गरेकोले अर्को सूचना नआउँदासम्म त्रीशुली नदीको तटिय क्षेत्रका जिल्लाहरु नुवाकोट, धादिङ, चितवन, गोरखा लगायतका स्थानहरूमा उच्च सतर्कता सहित सुरक्षित स्थानमा रहन अनुरोध छ। pic.twitter.com/Zun6icZZCM
— Nepal Police (@NepalPoliceHQ) August 26, 2026
ఈ వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. మరోవైపు రంగంలోకి దిగిన ఆర్మీ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. గల్లంతైన వారికోసం తీవ్రంగా గాలింపు మొదలు పెట్టింది. అయితే, కొండ ప్రాంతాలు కావడంతో రెస్క్యూ ఆపరేషన్స్ క్లిష్టంగా మారాయి. దీంతో అధికారులు రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మరోవైపు వర్షాల కారణంగా ఈ వరదలు సంభవించలేదని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నదిలో వరద ఆకస్మికంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎగువన ఉన్న హిమానీనదం కరగడం వల్ల ఈ ఆకస్మిక వరదలు వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కొండల మధ్య నుంచి వరద ముంచెత్తుతున్న భయానక దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
VIDEO | Nepal: Devastating flash flood causes major damage to markets and hydropower projects in Rasuwa region. More details are awaited.#NepalNews #NepalFlashFlood
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/QQmU1advuw
— Press Trust of India (@PTI_News) August 26, 2026
Also Read..
టాక్సిక్ రివ్యూ - గన్స్, వయలెన్స్..బోల్డ్ సీన్ల మధ్య నలిగిపోయిన కథ
మహారాష్ట్ర విషాదం: ఐఫోన్ కాదు.. ఆ కుటుంబం కొండపైనుంచి పడిపోవడానికి అసలు కారణం ఇదే!
తాజావార్తలు
- ●boltt Ace 5G | స్మార్ట్‌ఫోన్ మేకింగ్‌లోకి బోల్ట్.. తొలి రెండు ఫోన్లు లాంచ్, ధర రూ.9,999 మాత్రమే..
- ●Maharashtra Cliff Death | మహారాష్ట్ర విషాదం: ఐఫోన్ కాదు.. ఆ కుటుంబం కొండపైనుంచి పడిపోవడానికి అసలు కారణం ఇదే!
- ●Madhavaram Krishna Rao | నా మీద పగుంటే సంపేయండి.. అవసరమైతే ప్రజల కోసం ఉరేసుకొని సస్తా
- ●BCCI AGM | ఐపీఎల్ కొత్త చైర్మన్ ఎవరూ..? త్వరలో బీసీసీఐ కీలక భేటీ..!
- ●RBI | ఎన్ఆర్ఐల నుంచి భారీగా విదేశీ నిధులు.. ఆర్బీఐ స్వాప్‌తో 73 బిలియన్ డాలర్లు..
- ●Instagram Engagement | జెన్‌జీ నిరసనల తర్వాత.. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఎంగేజ్‌మెంట్.. 289.9% వృద్ధి

boltt Ace 5G | స్మార్ట్‌ఫోన్ మేకింగ్‌లోకి బోల్ట్.. తొలి రెండు ఫోన్లు లాంచ్, ధర రూ.9,999 మాత్రమే..

Maharashtra Cliff Death | మహారాష్ట్ర విషాదం: ఐఫోన్ కాదు.. ఆ కుటుంబం కొండపైనుంచి పడిపోవడానికి అసలు కారణం ఇదే!

Madhavaram Krishna Rao | నా మీద పగుంటే సంపేయండి.. అవసరమైతే ప్రజల కోసం ఉరేసుకొని సస్తా

BCCI AGM | ఐపీఎల్ కొత్త చైర్మన్ ఎవరూ..? త్వరలో బీసీసీఐ కీలక భేటీ..!






