Kalvakuntla Kavitha | ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి పెళ్లి కూతురికి తాళి కట్టిన కల్వకుంట్ల కవిత
కీసరలో జరిగిన ఓ వివాహ వేడుకలో కల్వకుంట్ల కవిత వధువుకు స్వయంగా తాళి కట్టారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం ఆమె ఈ ఆచారాన్ని ఎందుకు పాటించాల్సి వచ్చిందో తెలుసా?
- కీసర ఎక్స్ రోడ్డులో జరిగిన వివాహ వేడుకలో సందడి చేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత
- వరుడు బాలప్రసాద్‌కు సొంత సోదరి లేకపోవడంతో కవితకు ఆడపడుచుగా ప్రత్యేక ఆహ్వానం
- ముదిరాజ్ కులాచారం ప్రకారం వధువు శివాని మెడలో పసుపు కొమ్ము దారంతో కవిత మూడు ముళ్లు
- నూతన వధూవరులను ఆశీర్వదించి, వడిబియ్యం పోసిన కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బుధవారం కీసర ఎక్స్ రోడ్డులో జరిగిన ఓ వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన వరుడు బాషబోయిన బాలప్రసాద్, వధువు శివానిల పెళ్లిలో ఆమె 'ఆడబిడ్డ'గా వ్యవహరించి వధువుకు స్వయంగా పసుపుతాడు కట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ఆడపడుచుగా గ్రాండ్ వెల్కమ్..
ముదిరాజ్ కులాచారం ప్రకారం.. వరుడు వధువుకు మాంగళ్యధారణ చేసే ముందు.. వరుడి సోదరి (ఆడపడుచు) పసుపు కొమ్ము దారాన్ని తాళిగా భావించి వధువు మెడలో మూడు ముళ్లు వేయడం ఒక సంప్రదాయం. అయితే, వరుడు బాలప్రసాద్‌కు తోబుట్టువులు (సోదరీమణులు) ఎవరూ లేరు. దీంతో తన పెళ్లికి ఆడపడుచు స్థానంలో ఉండి ఆశీర్వదించాలని ఆయన కవితను ప్రత్యేకంగా కోరారు.

ఆయన కోరిక మేరకు బుధవారం కీసరలోని ఆరాధ్య కన్వెన్షన్‌లో జరిగిన ఈ మ్యారేజ్ ఈవెంట్‌కు కవిత హాజరయ్యారు. పెళ్లి మండపానికి చేరుకున్న ఆమెకు ఇరు కుటుంబాల సభ్యులు 'గ్రాండ్ వెల్కమ్' చెప్పారు.

వధువుకు మూడు ముళ్లు..
ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా ప్రధాన గౌరీ పూజలో కవిత పాల్గొన్నారు. అనంతరం మేళతాళాల నడుమ వధువు శివాని మెడలో పసుపు కొమ్ము దారంతో మూడు ముళ్లు వేశారు. వధువు ఉంగరపు వేలుకు ప్రధాన ఉంగరాన్ని తొడిగి మురిసిపోయారు. ఆ తర్వాత వడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను సంప్రదాయబద్ధంగా ఆశీర్వదించారు.

నూతన వస్త్రాలు అందజేసి, సుముహూర్తానికి కొత్త దంపతులకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. కవిత లాంఛనం పూర్తయిన తర్వాత వరుడు బాలప్రసాద్ వధువు మెడలో మంగళసూత్రధారణ చేశారు. ఈ వేడుకలో వరుడి తల్లిదండ్రులు స్వరూప, బాలకృష్ణ, సోదరుడు నాగరాజుతో పాటు పలువురు తెలంగాణ రక్షణ సేన నాయకులు సంతోషంగా పాల్గొన్నారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

తండ్రి నీడ నుంచి… ‘అమ్మ’గా ఎవల్యూషన్: కవిత రాజకీయ వ్యూహాల కొత్త అధ్యాయం
ఆగస్టు 22, 2026

Kalvakuntla Kavitha | కోహినూర్ వజ్రం తిరిగిచ్చేయండి.. భారతీయులకు బ్రిటన్ రాజు క్షమాపణ చెప్పాల్సిందే: కవిత సంచలన వ్యాఖ్యలు
ఆగస్టు 15, 2026

Kalvakuntla Kavitha | స్వేచ్ఛ అనేది ఉచితంగా వచ్చేది కాదు.. పోరాడి సాధించుకోవాలి
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●boltt Ace 5G | స్మార్ట్ఫోన్ మేకింగ్లోకి బోల్ట్.. తొలి రెండు ఫోన్లు లాంచ్, ధర రూ.9,999 మాత్రమే..
- ●Nepal Flash Floods | ఉప్పొంగిన నది.. కొట్టుకుపోయిన గ్రామాలు
- ●Maharashtra Cliff Death | మహారాష్ట్ర విషాదం: ఐఫోన్ కాదు.. ఆ కుటుంబం కొండపైనుంచి పడిపోవడానికి అసలు కారణం ఇదే!
- ●Madhavaram Krishna Rao | నా మీద పగుంటే సంపేయండి.. అవసరమైతే ప్రజల కోసం ఉరేసుకొని సస్తా
- ●BCCI AGM | ఐపీఎల్ కొత్త చైర్మన్ ఎవరూ..? త్వరలో బీసీసీఐ కీలక భేటీ..!
- ●RBI | ఎన్ఆర్ఐల నుంచి భారీగా విదేశీ నిధులు.. ఆర్బీఐ స్వాప్తో 73 బిలియన్ డాలర్లు..

boltt Ace 5G | స్మార్ట్ఫోన్ మేకింగ్లోకి బోల్ట్.. తొలి రెండు ఫోన్లు లాంచ్, ధర రూ.9,999 మాత్రమే..

Nepal Flash Floods | ఉప్పొంగిన నది.. కొట్టుకుపోయిన గ్రామాలు

Maharashtra Cliff Death | మహారాష్ట్ర విషాదం: ఐఫోన్ కాదు.. ఆ కుటుంబం కొండపైనుంచి పడిపోవడానికి అసలు కారణం ఇదే!

Madhavaram Krishna Rao | నా మీద పగుంటే సంపేయండి.. అవసరమైతే ప్రజల కోసం ఉరేసుకొని సస్తా



