త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhavaram Krishna Rao | నా మీద ప‌గుంటే సంపేయండి.. అవ‌స‌ర‌మైతే ప్ర‌జ‌ల కోసం ఉరేసుకొని స‌స్తా

Madhavaram Krishna Rao | కాంగ్రెస్ పార్టీలో చేర‌నందుకు నా మీద ప‌గుంటే సంపేయండ‌ని.. కానీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి వారిని కాపాడాల‌ని కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు వ్యాఖ్య‌నించారు. అవ‌స‌ర‌మైతే ప్ర‌జ‌ల కోసం ఉరేసుకొని చావ‌డానికైనా సిద్ధ‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

S

Telangana | Published On Aug 26, 2026, 1.54 pm IST

Madhavaram Krishna Rao | నా మీద ప‌గుంటే సంపేయండి.. అవ‌స‌ర‌మైతే ప్ర‌జ‌ల కోసం ఉరేసుకొని స‌స్తా
Advertisement
  • కానీ 22ఎ నిషేధిత జాబితాలో నుంచి మా కాల‌నీ భూములు తీసేదాకా వ‌దిలిపెట్ట‌
  • సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు వార్నింగ్‌

Madhavaram Krishna Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కూక‌ట్‌ప‌ల్లిలోని భూముల‌ను 22ఎ నిషేధిత జాబితా నుంచి తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అప్ప‌టిదాకా సీఎం రేవంత్‌రెడ్డిని వ‌దిలిపెట్ట‌న‌ని హెచ్చ‌రించారు. బుధ‌వారం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన భూ బాధితుల స‌మావేశంలో ఆయ‌న భావోద్వేగంతో ప్ర‌సంగించారు.

మా ప్ర‌జ‌లు 72 వేల మెజారిటీతో గెలిపిచ్చిర‌న్నా న‌న్ను. హైద‌రాబాద్‌లో టాప్ మెజారిటీ అన్నా నాది. నా మీద ప‌గ ఉంటే న‌న్ను సంపేయండన్నా స‌స్తా. మూడు ముక్క‌లు చేసిర్ర‌న్నా నా నియోజ‌క‌వ‌ర్గాన్ని. ఒక‌టేమో హైద‌రాబాద్‌ల క‌లిపిర్రు, ఇంకోటేమో మ‌ల్కాజిగిరిలా క‌లిపిర్రు. మ‌ళ్లోటేమో ఇంకెండ్ల‌నో చేర్చిర్రు. నేను మీ పార్టీల జాయిన్ కాలేగా.. న‌న్ను సంపేయండి స‌స్తా. నా ప్ర‌జ‌ల‌ను కాపాడండి. నా మీద కోపంతోటి నా ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌ర‌గొద్దు.

మాధ‌వ‌రం ఊకూనే వ్య‌క్తి కాడు..

ఇదిగిట్ల మీరు తీయ‌క‌పోతే.. నేన్ ముఖ్య‌మంత్రికి రెక్వెస్ట్ చేసి చెప్తున్నా. మా కాల‌నీని 22ఎ లకెంచి తీయ‌క‌పోతే, మా ప్ర‌జ‌ల‌ను ఇట్ల‌నే ఇబ్బంది పెడ‌తా ఉంటే ఈ మాధ‌వ‌రం ఊకూనే వ్య‌క్తి కాడు. అవ‌స‌ర‌మైతే ఈన్నే ఉరివెట్టుకొని స‌స్తా నా ప్ర‌జ‌ల కోసం. కానీ నిన్నైతే వ‌దిలిపెట్ట‌.

అందుకే బీఆర్ఎస్‌కు ఓటేసిర్రు..

మీరు ఏదైతే మాట్లాడుతున్న‌రో.. మీ మంత్రిగారు మాట్లాడుతున్న‌రో హైద‌రాబాద్ న‌గ‌రంలో మేం ఏం చేశామో, మీరు ఏం చేశారో ప్ర‌జ‌ల‌కు తెలుసు. గ‌తంలో ఎంత ల్యాండ్ అమ్ముకున్న‌రో.. మేం వ‌చ్చిన తర్వాత గ‌జం కూడా అమ్మ‌లే. ఎవ‌రినీ బాధ‌పెట్ట‌లే మేం. కొన్నిరోజులు మీరు హైడ్రా తీసుకొచ్చిండ్రు. ఇక్క‌డున్న టౌన్‌షిప్ ప్రెసిడెంట్ వ‌చ్చిండు మొన్న‌. నీళ్ల కోసం 70 ల‌క్ష‌లు క‌డుతున్నం సార్ అని చెప్తున్న‌డు. అట్లా ఉంది మీ పాల‌న‌. మేమేమో ప్ర‌జ‌ల‌కు నీళ్లు ఇచ్చినం బ్ర‌హ్మాండంగా. అందుకే మా ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌కు ఓటేసిర్రు. అందుకే దీనికి మీరు స‌పోర్ట్‌గా ఉండాలి అని మాజీ మంత్రి హ‌రీశ్ రావును కృష్ణారావు కోరారు.

Advertisement
Advertisement