త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

boltt Ace 5G | స్మార్ట్‌ఫోన్ మేకింగ్‌లోకి బోల్ట్‌.. తొలి రెండు ఫోన్లు లాంచ్‌, ధ‌ర రూ.9,999 మాత్ర‌మే..

boltt Ace 5G | ఫైర్‌-బోల్ట్‌ మాతృ సంస్థకు చెందిన స్వదేశీ బ్రాండ్‌ బోల్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ తొలిసారిగా రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బోల్ట్‌ ఏస్ 5జి, బోల్ట్‌ ఈవో పేర్లతో ఈ ఫోన్లను విడుదల చేసింది. భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఈ రెండు ఫోన్లలో బ్లోట్‌వేర్‌ లేని ఆండ్రాయిడ్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అందించారు.

S

Technology | Published On Aug 26, 2026, 2.29 pm IST

boltt Ace 5G | స్మార్ట్‌ఫోన్ మేకింగ్‌లోకి బోల్ట్‌.. తొలి రెండు ఫోన్లు లాంచ్‌, ధ‌ర రూ.9,999 మాత్ర‌మే..
Advertisement

boltt Ace 5G | ఫైర్‌-బోల్ట్‌ మాతృ సంస్థకు చెందిన స్వదేశీ బ్రాండ్‌ బోల్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ తొలిసారిగా రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బోల్ట్‌ ఏస్ 5జి, బోల్ట్‌ ఈవో పేర్లతో ఈ ఫోన్లను విడుదల చేసింది. భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఈ రెండు ఫోన్లలో బ్లోట్‌వేర్‌ లేని ఆండ్రాయిడ్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అందించారు. గూగుల్‌ జెమిని ఏఐ ఫీచర్లతోపాటు పెద్ద డిస్‌ప్లేలు, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలను వీటిలో పొందుపరిచారు. రెండు ఫోన్లలోనూ 6.79 ఇంచుల డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్‌ రేట్‌, గరిష్ఠంగా 600 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఉన్నాయి. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 16తో స్టాక్‌ ఆండ్రాయిడ్‌ తరహా క్లీన్‌ ఇంటర్‌ఫేస్‌ను అందించారు. గూగుల్‌ జెమినితో పాటు సర్కిల్‌ టు సెర్చ్‌, గూగుల్‌ లెన్స్‌, ఫొటో ప్రాసెసింగ్‌ కోసం ఏఐ నైట్‌ మోడ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్‌ కెమెరాను, విభిన్న స్కిన్ క‌ల‌ర్స్‌ను సహజంగా చూపించేందుకు రియల్‌ టోన్‌ ప్రాసెసింగ్‌తో అందించారు.

ఏఐ కెమెరాలు, ఫాస్ట్ చార్జింగ్‌..

బోల్ట్‌ ఏస్ 5జిని ఈ సిరీస్‌లో ప్రీమియం మోడల్‌గా తీసుకొచ్చారు. ఇందులో యునిసాక్ టి8200 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక భాగంలో 64 మెగాపిక్స‌ల్‌ ఏఐ ప్రధాన కెమెరా ఉంది. ఏఐ పోర్ట్రెయిట్‌ మోడ్‌, ఏఐ నైట్‌ మోడ్‌ వంటి కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఏస్ 5జిలో 18 వాట్ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. యూఎస్‌బీ టైప్ సి ద్వారా ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. 18 వాట్ల ఛార్జర్‌ను బాక్స్‌లోనే అందిస్తున్నారు. కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపుల కోసం ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్‌ కూడా ఉంది. స్టోరేజ్‌ను మరింత పెంచుకునేందుకు ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ సదుపాయం ఇచ్చారు. ఆర్కిటిక్‌ వైట్‌, బర్గండీ బ్లిస్‌, ఫారెస్ట్‌ గ్రీన్‌, లావెండర్‌ బ్లూమ్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌, స్కై బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తోంది. ఇక బోల్ట్‌ ఈవోను ఎంట్రీ-లెవల్‌ మోడల్‌గా తీసుకొచ్చారు. ఇందులో యునిసాక్ టి7250 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌ను అందించారు. వెనుక భాగంలో 50 మెగాపిక్స‌ల్‌ ఏఐ ప్రధాన కెమెరాతోపాటు 2 మెగాపిక్స‌ల్‌ మాక్రో కెమెరా క‌లిగిన డ్యుయల్‌ కెమెరా సెటప్‌ ఉంది. ఏఐ పోర్ట్రెయిట్‌ మోడ్‌, ఏఐ నైట్‌ మోడ్‌, ఏఐ సెల్ఫీ ఎన్‌హాన్స్‌మెంట్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆర్కిటిక్‌ వైట్‌, బెర్రీ రెడ్‌, లావెండర్‌ బ్లూమ్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌, స్కై బ్లూ రంగుల్లో ఈ మోడల్‌ లభిస్తోంది.

ధ‌ర వివ‌రాలు..

ఏస్ 5జిలో 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ ర్యామ్‌ వేరియంట్లు ఉన్నాయి. స్టోరేజ్‌ పరంగా 64 జీబీ, 128 జీబీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈవోలో 4 జీబీ, 6 జీబీ ర్యామ్‌ ఆప్షన్లతో పాటు 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. అయితే ఏస్ 5జిలో మాత్రమే 18 వాట్ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌, ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్‌ అందించారు. బోల్ట్‌ ఏస్ 5జి 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.13,999 ఉండ‌గా తొలి రోజు లాంచ్‌ ఆఫర్‌లో రూ.12,999కే లభిస్తోంది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.14,999 కాగా, లాంచ్‌ ఆఫర్‌ ధర రూ.13,999గా ఉంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.15,999 కాగా, తొలి రోజు ఆఫర్‌లో రూ.14,999కు కొనుగోలు చేయవచ్చు. బోల్ట్‌ ఈవో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.10,999 ఉండ‌గా, తొలి రోజు లాంచ్‌ ఆఫర్‌లో రూ.9,999కే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.11,999 కాగా, లాంచ్‌ ఆఫర్‌లో రూ.10,999కు లభిస్తోంది. బోల్ట్‌ ఏస్ 5జి, బోల్ట్‌ ఈవో స్మార్ట్‌ఫోన్ల‌ను ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే విక్రయించనున్నారు. సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement