IMA Advisory | దేశవ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు.. కీలక అడ్వైజరీ జారీ చేసిన ఐఎంఏ..!
IMA Advisory | దేశవ్యాప్తంగా హెచ్1ఎన్1 (స్వైన్‌ఫ్లూ) కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజలకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఫ్లూ లక్షణాలు కనిపిస్తే సొంతంగా యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మందులు వాడొద్దని హెచ్చరించింది. తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.
Flash news | Published On Aug 26, 2026, 2.47 pm IST
IMA Advisory | దేశవ్యాప్తంగా హెచ్1ఎన్1 (స్వైన్‌ఫ్లూ) కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజలకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఫ్లూ లక్షణాలు కనిపిస్తే సొంతంగా యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మందులు వాడొద్దని హెచ్చరించింది. తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితిపై అప్రమత్తత అవసరమే తప్ప ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది. దేశంలో హెచ్1ఎన్1 కేసులు సీజనల్‌గా పెరుగుతున్నాయని ఐఎంఏ తెలిపింది. ఢిల్లీలో 1,770కి పైగా కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఐసీఎంఆర్ అధ్యయనంలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది సాధారణ సీజనల్ హెచ్1ఎన్1 వైరస్‌గానే తేలిందని, కొత్త జన్యు మార్పులేవీ గుర్తించలేదని వెల్లడించింది.
జ్వరం, దగ్గు.. ప్రధాన లక్షణాలు
అకస్మాత్తుగా అధిక జ్వరం, చలి, పొడి దగ్గు, గొంతునొప్పి, కండరాల నొప్పులు, తీవ్ర నీరసం హెచ్1ఎన్1 ప్రధాన లక్షణాలని ఐఎంఏ తెలిపింది. తలనొప్పి, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ కూడా ఉండొచ్చు. పిల్లల్లో వాంతులు, విరేచనాలు కనిపించే అవకాశం ఉంది. చాలా వరకు ఇన్‌ఫెక్షన్స్ స్వల్పంగా ఉండి వాటంతట అవే తగ్గిపోతాయని పేర్కొంది. అయితే, హెచ్1ఎన్1 వైరస్ వల్ల వచ్చే వ్యాధి కావడంతో యాంటీబయాటిక్స్ పనిచేయవని ఐఎంఏ స్పష్టం చేసింది. అజిత్రోమైసిన్, అమోక్సిసిలిన్-క్లావులనేట్, సెఫిక్సిమ్ వంటి మెడిసిన్స్‌ను వైద్యుల సలహా లేకుండా తీసుకోవద్దని సూచించింది. అవసరం లేని యాంటీబయాటిక్స్ వాడకం వల్ల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ముప్పు పెరుగుతుందని హెచ్చరించింది. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించిన సమయంలో మాత్రమే వాటిని వాడాలని చెప్పింది. ఓసెల్టామివిర్ వంటి యాంటీవైరల్ మందులను కూడా వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలని స్పష్టం చేసింది.
శ్వాసలో ఇబ్బందులుంటే..
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతీ నొప్పి, పెదాలు, వేళ్లు నీలిరంగులోకి మారడం, రక్తంతో దగ్గు, స్పృహ కోల్పోవడం, గందరగోళం, మూర్ఛలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలని ఐఎంఏ సూచించింది. నిరంతరం వాంతులు కావడం, ద్రవాలు తీసుకోలేకపోవడం కూడా ప్రమాద సంకేతాలేనని తెలిపింది. పిల్లల్లో ఆహారం లేదా పాలు తీసుకోకపోవడం, తీవ్ర నీరసం, శ్వాసలో గురక, ఛాతీ లోపలకు ఎక్కువగా లాగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని పేర్కొంది.
ఏం చేయాలి..
సబ్బుతో కనీసం 20 సెకన్లు చేతులు కడుక్కోవాలని, దగ్గు, తుమ్మే సమయంలో ముక్కు, నోటికి అడ్డంగా టిష్యూ మోచేతిని అడ్డుగో పెటుకోవాలని ఐఎంఏ సూచించింది. రద్దీగా ఉండే, మూసివున్న ప్రదేశాల్లో మాస్క్ ధరించడం ద్వారా ఇన్‌ఫెక్షన్ ముప్పును తగ్గించవచ్చని తెలిపింది. జ్వరం తగ్గిన తర్వాత కనీసం 24 గంటలు పాఠశాల, కార్యాలయం, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది. వైద్య సిబ్బంది, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఉన్నవారు ఏటా సీజనల్ ఫ్లూ టీకా తీసుకోవాలని ఐఎంఏ కోరింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Dasoju Sravan Kumar | కుల గణనలో ఓబీసీ కేటగిరీ చేర్చాలి
- ●Accident in America | అమెరికాలో చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం
- ●IPO | ఐపీఓ మార్కెట్లలో జోరు.. ఈ నాలుగు ఇష్యూలపై ఇన్వెస్టర్ల ఫోకస్..
- ●Vemula Prashanth Reddy | ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత సీఎంకు ఉందా..?
- ●Konda Murali | కాంగ్రెస్‌ను వీడం.. నా బిడ్డ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: కొండా మురళి
- ●Konda Surekha Resignation | కొండా సురేఖ వ్యవహారం : మీరే చూసుకోండి.. అంతా భట్టికే వదిలేసిన హైకమాండ్

Dasoju Sravan Kumar | కుల గణనలో ఓబీసీ కేటగిరీ చేర్చాలి

Accident in America | అమెరికాలో చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం

IPO | ఐపీఓ మార్కెట్లలో జోరు.. ఈ నాలుగు ఇష్యూలపై ఇన్వెస్టర్ల ఫోకస్..

Vemula Prashanth Reddy | ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత సీఎంకు ఉందా..?




