త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Leopard | గాయ‌ప‌డిన చిరుత‌ను కాపాడేందుకు వెళ్ల‌గా.. అధికారుల‌పై దాడి.. షాకింగ్ వీడియో

Leopard | క‌ర్ణాట‌క (Karnataka) దావ‌ణ‌గెరెలో (Davangere) షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. గాయ‌ప‌డిన చిరుత‌ను కాపాడేందుకు వెళ్లిన అట‌వీ శాఖ అధికారుపై అది దాడి చేసింది (Leopard Attacks Forest Official). ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

D

National | Published On Sep 8, 2026, 12.28 pm IST

Leopard | గాయ‌ప‌డిన చిరుత‌ను కాపాడేందుకు వెళ్ల‌గా.. అధికారుల‌పై దాడి.. షాకింగ్ వీడియో
Advertisement

Leopard | త్రినేత్ర‌.న్యూస్ : క‌ర్ణాట‌క (Karnataka) దావ‌ణ‌గెరెలో (Davangere) షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. గాయ‌ప‌డిన చిరుత‌ను కాపాడేందుకు వెళ్లిన అట‌వీ శాఖ అధికారుల‌కు ఊహించ‌ని అనుభ‌వం ఎదురైంది. రెస్క్యూ చేసేందుకు వెళ్లిన సిబ్బందిపై ఆ చిరుత ఒక్క‌సారిగా దాడి చేసి గాయ‌ప‌రిచింది (Leopard Attacks Forest Official). ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

దావ‌ణ‌గెరె హైవేపై రోడ్డు దాటుతున్న చిరుత‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆ చిరుత గాయ‌ప‌డింది. స‌మాచారం అందుకున్న అట‌వీ శాఖ అధికారులు హుటాహుటిన అక్క‌డికి వెళ్లారు. రెస్క్యూ చేసేందుకు చిరుత‌కు వారు మ‌త్తుమందు ఇచ్చారు. ఆ స‌మ‌యంలో అది అధికారుల‌పై ఒక్క‌సారిగా దాడి చేసింది. ఈ దాడిలో ఓ అధికారి గాయ‌ప‌డ్డాడు. కాసేప‌టికి చిరుత మ‌త్తులోకి జారుకోగానే దాన్ని బంధించి చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైర‌ల్ అవుతోంది.

Also Read..

ఎయిర్ హోస్టెస్‌, ఫ్రీ వైఫై.. విమానాన్ని త‌ల‌పించే ఆర్టీసీ బ‌స్సు.. ఎక్క‌డో తెలుసా..?

ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ

హిందూ బృందం సంద‌ర్శ‌న‌పై వివాదం.. మూత‌ప‌డిన ఈఫిల్ ట‌వ‌ర్‌

Advertisement
Advertisement