త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress Minister | కాంగ్రెస్ మంత్రి రాజీనామా.. ఆ ఆరోప‌ణ‌ల‌న్నీ రాజ‌కీయ ప్రేరేపిత‌మే..!

Congress Minister | క‌ర్ణాట‌క సీఎం డీకే శివ‌కుమార్ కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న బీ నాగేంద్ర సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న మంత్రి పద‌వితో పాటు ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు.

S

National | Published On Aug 28, 2026, 7.26 pm IST

Congress Minister | కాంగ్రెస్ మంత్రి రాజీనామా.. ఆ ఆరోప‌ణ‌ల‌న్నీ రాజ‌కీయ ప్రేరేపిత‌మే..!
Advertisement

Congress Minister | త్రినేత్ర‌.న్యూస్ : క‌ర్ణాట‌క సీఎం డీకే శివ‌కుమార్ కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న బీ నాగేంద్ర సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న మంత్రి పద‌వితో పాటు ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు. క‌ర్ణాట‌క మ‌హ‌ర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌లో అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో నాగేంద్ర ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన సంద‌ర్భంగా నాగేంద్ర క‌న్నీరు పెట్టుకున్నారు. తాను బీజేపీ మ‌నువాద రాజ‌కీయాల‌కు బ‌ల‌య్యాన‌ని భావోద్వేగానికి లోన‌య్యారు. పార్టీకి చెడ్డ‌పేరు రాకూడ‌ద‌ని స్వ‌చ్ఛందంగా మంత్రి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

వాల్మీకి కార్పొరేష‌న్‌లో అవినీతి అంటూ త‌నపై చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ రాజ‌కీయ ప్రేరేపిత‌మైన‌వ‌ని నాగేంద్ర తెలిపారు. సీబీఐ, ఈడీ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల ద్వారా బీజేపీ త‌న‌ను భ‌య‌పెట్ట‌లేవ‌ని, విచార‌ణ‌కు స‌హ‌క‌రించి నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డుతాన‌ని పేర్కొన్నారు. వాల్మీకి కార్పొరేష‌న్‌లో నిధుల మ‌ళ్లింపు వ్య‌వ‌హారంలో నాగేంద్ర‌ను మంత్రి వ‌ర్గం తొల‌గించాల‌ని ప్ర‌తిప‌క్షాలైన బీజేపీ, జేడీఎస్ తీవ్ర స్థాయిలో డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

నెల రోజుల క్రిత‌మే మంత్రిగా ప్ర‌మాణం

2024లో ఇదే వివాదంపై మంత్రివర్గం నుంచి నాగేంద్ర త‌ప్పుకున్నారు. మ‌ళ్లీ డీకే శివ‌కుమార్ కేబినెట్‌లో ఆయ‌న మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. నెల రోజుల క్రిత‌మే మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు నాగేంద్ర‌. ఇటీవ‌ల జ‌రిగిన వ‌ర్షాకాల అసెంబ్లీ స‌మావేశాల్లో నాగేంద్ర త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని బీజేపీ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన ఒత్తిడి చేసింది.

వాల్మీకి స్కామ్ డ‌బ్బుతో.. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చారం

అయితే ఈ వాల్మీకి కుంభ‌కోణంలో కాంగ్రెస్ నేత నాగేంద్ర‌నే కీల‌క సూత్ర‌ధారి అని ఈడీ నిర్ధారించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ఆయ‌న‌పై ప్ర‌త్యేక కోర్టులో ఛార్జీషీట్ కూడా దాఖ‌లైంది. వాల్మీకి కుంభకోణానికి సంబంధించి ఈడీ చార్జిషీట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మతో కలిసి రూ.21 కోట్ల నిధులను నాగేంద్ర పక్కదారి పట్టించినట్టు ఈడీ పేర్కొన్నది. బెంగళూరుతో పాటు బళ్లారి నుంచి ఈ డబ్బులను వివిధ ప్రాంతాలకు అక్రమంగా పంపించారని, లోక్‌సభ ఎన్నికల్లో వీటిని వినియోగించినట్టు ఈడీ గుర్తించింది.

ఈడీ ఛార్జీషీట్‌పై కేటీఆర్ స్పంద‌న‌

వాల్మీకి స్కామ్‌పై ఈడీ దాఖ‌లు చేసిన ఛార్జీషీట్‌పై గ‌తంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. కర్ణాటకలో గిరిజన సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన సొమ్మును కాంగ్రెస్‌ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం వాడుకుందని కేటీఆర్ ఆరోపించారు. వాల్మీకి స్కామ్‌గా చెప్తున్న ఈ కుంభకోణంలో నిధులను దారి మళ్లించి వాడుకున్న కాంగ్రెస్‌ నేతలను శిక్షించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు అయిన బిల్డ‌ర్ స‌త్య‌నారాయ‌ణ వ‌ర్మ‌.. తెలంగాణకు చెందిన ఇద్ద‌రు కీల‌క కాంగ్రెస్ నేత‌ల‌కు అత్యంత స‌న్నిహితుడు అని కేటీఆర్ పేర్కొన్నారు. వ‌ర్మ‌కు సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. దర్యాప్తు సంస్థలు వాల్మీకి స్కామ్‌లో నిజాలు నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలి..’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement