Vakiti Srihari | ఇప్పటికీ పెత్తందార్ల పోకడలు కొనసాగడం దురదృష్టకరం: మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari | బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌ను అవమానించారని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయ సభలపై ఆ పార్టీ దురహంకార ధోరణి వీడాలన్నారు
Vakiti Srihari | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌ను అవమానించారని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయ సభలపై ఆ పార్టీ దురహంకార ధోరణి వీడాలన్నారు. ఈ సభ కొందరిది కాదదని, అందరిదని స్పష్టం చేశారు. స్పీకర్‌పై జరిగిన దాడిపై చర్చ జరలన్నారు. నాటి నుంచి నేటి వరకు పెత్తందార్ల పోకడలు ఇంకా కొనసాగడం దురదృష్టకరమని చెప్పారు. పదే పదే స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తొలిసారి ఏమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చానని, తనకు కూడా మాట్లాడే అవకాశం లేకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి అడ్డుపడుతున్నారని చెప్పారు.
ఎమ్మెల్సీ తాత మధు మాటల వెనుక తప్పుడు ఆలోచన విధానం దాగి ఉందన్నారు. ఇంకా అణచివేత ధోరణులు కొనసాగడం బాధాకరమని తెలిపారు. ఇలాంటి విధానాలు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అవమానిచడమేనని వెల్లడించారు. తాను జడ్పీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నప్పుడు 29సార్లు గృహ నిర్భంధం చేశారని గుర్తుచేసుకున్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్భంధం కొనసాగిందని చెప్పారు. స్పీకర్ రూల్ బుక్ ప్రకారమే సభను నిర్వహిస్తున్నారని తెలిపారు. గత అసెంబ్లీలో కేవలం పుస్తకం చింపినందుకే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేశారన్నారు. ఎమ్మెల్యేలు సబితా, సునీతాలక్ష్మారెడ్డిపై దాడి జరిగిన తీరును పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్‌పై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao | కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ రెడ్డి: హరీశ్ రావు
సెప్టెంబర్ 8, 2026

Gaddam Prasad Kumar | నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.. హరీశ్‌రావును ప్రశ్నించిన స్పీకర్
సెప్టెంబర్ 8, 2026

Padi Kaushik Reddy | కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Paytm | చాట్‌జీపీటీలోనే పేటీఎం పేమెంట్స్.. ఇక చెల్లింపుల వివరాలు క్షణాల్లో..
- ●KSRTC | ఎయిర్ హోస్టెస్, ఫ్రీ వైఫై.. విమానాన్ని తలపించే ఆర్టీసీ బస్సు.. ఎక్కడో తెలుసా..?
- ●VC Sajjanar | ఆన్లైన్లో గణేశ్ మండపాల నమోదు తప్పనిసరి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
- ●Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
- ●Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో మళ్లీ జోష్..
- ●MLA Sanjay | మగ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులు.. ఆడ ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులా..!

Paytm | చాట్‌జీపీటీలోనే పేటీఎం పేమెంట్స్.. ఇక చెల్లింపుల వివరాలు క్షణాల్లో..

KSRTC | ఎయిర్ హోస్టెస్, ఫ్రీ వైఫై.. విమానాన్ని తలపించే ఆర్టీసీ బస్సు.. ఎక్కడో తెలుసా..?

VC Sajjanar | ఆన్లైన్లో గణేశ్ మండపాల నమోదు తప్పనిసరి: హైదరాబాద్ సీపీ సజ్జనార్

Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ



